Rampur District: ఇటీవ‌లి కాలంలో కోతులు ఆహారం కోసం ప్రజలపై దాడి చేయడం లేదా ఇంటి ఆవ‌ర‌ణ‌లోని మొక్కలను నాశనం చేయడం వంటి ఘ‌ట‌న‌లు చాలానే చూస్తున్నాం. మ‌రికొన్ని ప్రాంతాల్లో ఏకంగా ఇంట్లోకి వ‌చ్చి వ‌స్తువుల‌ను నాశ‌నం చేయ‌డం లేదా ఎత్తుకెళ్ల‌డం చేస్తున్న ఘ‌ట‌న‌లు ఉన్నాయి. అయితే, ఇదేది కాకుండా ఒక కోతి అక్షరాలా ల‌క్ష రూపాయ‌ల‌ నగదుతో కూడిన బ్యాగ్‌ని ఎత్తుకెళ్లిపోయింది. ఈ  విచిత్ర ఘ‌ట‌న ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.. !  

Monkey snatches bag full of Rs 1 lakh: ఇటీవ‌లి కాలంలో కోతులు ఆహారం కోసం ప్రజలపై దాడి చేయడం లేదా ఇంటి ఆవ‌ర‌ణ‌లోని మొక్కలను నాశనం చేయడం వంటి ఘ‌ట‌న‌లు చాలానే చూస్తున్నాం. మ‌రికొన్ని ప్రాంతాల్లో ఏకంగా ఇంట్లోకి వ‌చ్చి వ‌స్తువుల‌ను నాశ‌నం చేయ‌డం లేదా ఎత్తుకెళ్ల‌డం చేస్తున్న ఘ‌ట‌న‌లు ఉన్నాయి. అయితే, ఇదేది కాకుండా ఒక కోతి అక్షరాలా ల‌క్ష రూపాయ‌ల‌ నగదుతో కూడిన బ్యాగ్‌ని ఎత్తుకెళ్లిపోయింది. ఈ విచిత్ర ఘ‌ట‌న ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.. !

వివ‌రాల్లోకెళ్తే.. ఇది ఆహారం కోసం లేదా ఏదైనా ఆసక్తికరమైన విషయం కోసం వెతుకుతున్నట్లు కనిపించిన ఒక కోతి ల‌క్ష రూపాయ‌లు ఉన్న బ్యాగును లాక్కెళ్లింది. ఈ ఘ‌ట‌న ఉత్తరప్రదేశ్ లోని రామ్‌పుర్ లో పరిధిలోని షహబాద్‌ లో చోటు చేసుకొంది. ల‌బోదిబోమంటు ఆ వ్య‌క్తి అధికారుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల‌ను ప‌రిశీలించిగా ఈ షాకింగ్ విష‌యం వెలుగు చూసింది. సేల్‌ డీడ్‌ కోసం షహబాద్‌లోని రిజిస్ట్రార్‌ కార్యాలయానికి షరాఫత్ హుస్సేన్ అనే వ్యక్తి త‌న బైక్ ను తీసుకుని వ‌చ్చాడు. తన వాహనాన్ని అక్క‌డే పెట్టి ప‌క్క‌నే ఒక బెంచ్‌పై కూర్చుని సేల్‌ డీడ్‌కు సంబంధించిన ప‌నులు చేసుకుంటున్నాడు.

అయితే, అటుగా వ‌చ్చిన ఒక కోతి, వాహనానికి తగిలించిన బ్యాగ్‌ను తీసుకుని పారిపోయింది. ఇది గ‌మ‌నించిన హుస్సేన్‌ బైక్‌ వద్దకు చేరుకోగా, అప్ప‌టికే ఆ కోతి అక్క‌డి నుంచి నేరుగా చెట్టుమీద‌కు చేరుకుంది. చూస్తుండగానే అక్కడ నుంచి అదృశ్యమైంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. విష‌యం తెలిసి అంద‌రూ ఇప్పుడు ఆ కోతి జాడ కోసం వెతుకుతున్నారు. ఎలాగోలా చివ‌ర‌కు ఒక చెట్టుపై బ్యాగ్ తో క‌నిపించిన కోతిని గుర్తించారు. దాని నుంచి బ్యాగు ను తీసుకునేందుకు చాలా చేసు ప్ర‌య‌త్నం చేయ‌గా, ఆ కోతి బ్యాగ్‌ను వదిలి వెళ్లిపోయింది. ఈ విష‌యం ఇప్పుడు వైర‌ల్ గా మారింది. కాగా ఈ ప్రాంతంలో కోతుల బెడదను అధికంగా ఉంద‌ని స్థానికులు చెబుతున్నారు. అయితే, కోతుల నుంచి వ‌స్తున్న స‌మ‌స్య‌ల‌ను తగ్గించేందుకు చర్య‌లు తీసుకుంటున్నామ‌ని జిల్లా యంత్రాంగం పేర్కొంది.