కోతుల బెడదపై రాజ్యసభలో చర్చ.. మా ఇంటి దగ్గరా కోతుల గోల: వెంకయ్యనాయుడు

Monkey menace at delhi bebate in rajyasabha
Highlights

ఢిల్లీలో కోతుల బెడదపై రాజ్యసభలో ఇవాళ చర్చ జరిగింది. జీరో అవర్‌లో ఐఎన్ఎల్‌డీ ఎంపీ రామ్‌కుమార్ కశ్యప్ సభలో చర్చను లేవనెత్తారు

ఢిల్లీలో కోతుల బెడదపై రాజ్యసభలో ఇవాళ చర్చ జరిగింది. జీరో అవర్‌లో ఐఎన్ఎల్‌డీ ఎంపీ రామ్‌కుమార్ కశ్యప్ సభలో చర్చను లేవనెత్తారు.. కోతులు ఇళ్ల ఆవరణలో ఉన్న చెట్లపై నుంచి దూకి.. అక్కడ ఆరేసిన బట్టలను ఎత్తుకెళ్లడంతో పాటు జనంపై దాడులు చేస్తున్నాయని కశ్యప్ సభ దృష్టికి తీసుకొచ్చారు.

ఇదే క్రమంలో ఓ సారి తనపై కూడా దాడి చేశాయని.. దీంతో తాను ఓ పార్లమెంటరీ కమిటీ సమావేశానికి ఆలస్యంగా రావాల్సి వచ్చిందని తెలిపారు.. కోతుల బెడదపై ప్రభుత్వం పరిష్కారాన్ని సూచించాలని కోరారు. ఈ అంశంపై ఛైర్మన్ వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. మా ఇంటి దగ్గర కూడా ఈ సమస్య ఉందని.. ఉపరాష్ట్రప్రతి నిలయం వద్ద కోతులు వీరంగం చేస్తున్నాయని అన్నారు... దీనిపై వన్యప్రాణి కార్యకర్తలు, కేంద్రమంత్రి మేనకా గాంధీ పరిష్కారాన్ని సూచించాలని వెంకయ్య కోరారు.

loader