వానర సాయం.. పాడుబడిన బావిలో పడిపోయిన పిల్లి.. అల్లాడిపోతూ కాపాడిన కోతి.. వీడియో వైరల్
పాడిబడిన ఓ బావిలో పిల్లి పడిపోయింది. దీంతో దానిని కాపాడేందుకు ఓ కోతి విశ్వ ప్రయత్నాలు చేసింది. తోటి జీవి పట్ల ఎంతో కరుణ చూపింది. దీనికి సంబంధించిన వీడియోను ఒకరు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం అది వైరల్ గా మారింది.
ఆపదలో చిక్కుకున్న మనిషిని కాపాడేందుకు తోటి మనిషి ఎంతో ఆలోచిస్తున్న ప్రస్తుత కాలంలో.. ఓ మూగ జీవి మరో జీవి పట్ల ఎంతో కరుణ చూపింది. ముప్పు తిప్పలు పడుతూ ఆ జంతువును కాపాడింది. ఆపదలో చిక్కుకున్న ఆ జంతువును రక్షించే సమయంలో అది అల్లాడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వార్నీ.. మహిళను కాటేసిన పాము.. విషసర్పాన్ని కూడా హాస్పిటల్ కు తీసుకెళ్లిన భర్త.. యూపీలో వింత ఘటన
ఓ పిల్లి నడుస్తూ అనుకోకుండా ఓ పాడు బడిన బావిలో పడిపోయింది. అయితే అందులో బురద ఉండటం, నేలకు కాస్త లోతులో ఉండటం వల్ల ఆ పిల్లి పైకి గెంతలేకపోయింది. ఆ బురదలోనే చిక్కుకుపోయింది. అయితే దీనిని ఓ కోతి గమనించింది. పిల్ల పడుతున్న అవస్థలను చూసి చలించిపోయింది. దానిని ఎలాగైన కాపాడాలని నిర్ణయించుకుంది.
జగదీశ్ శెట్టర్ ను కాంగ్రెస్ వాడుకొని వదిలేస్తుంది - కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై
వెంటనే ఆ బావి దగ్గరకు వెళ్లింది. మెళ్లగా బావిలోకి దిగింది. ఆ పిల్లిని చేతిలో పట్టుకొని పైకి ఎగురవేసేందుకు ప్రయత్నించింది. కానీ తన వల్ల కాలేదు. మళ్లీ పైకి ఎక్కింది. ఓ చేతిని బావి అంచుకు తగిలించి, మరో చేతితో పిల్లిని అందుకోవాలని చూసింది. కానీ అది సాధ్యం కాలేదు. ఈ క్రమంలో ఎంతో నిరుత్సాహానికి గురయ్యింది. అయినా కూడా తన ప్రయత్నాన్ని విరమించలేదు.
మళ్లీ బావి లోపలకు దిగుతూ, పైకి ఎక్కుతూ పిల్లిని కాపాడేందుకు ప్రయత్నించింది. ఈ సమయంలో అది ఎంతగానో అల్లాడిపోయింది. దానిని కాపాడేందుకు నానా తంటాలు పడింది. ఇలా ఎన్నో ప్రయత్నాలు చేయడం వల్ల అది పూర్తిగా అలసిపోయింది. అయినా కూడా తోటి జంతువును కాపాడాలని ఓపిక తెచ్చుకుంది. కొంత సమయం తరువాత ఈ కోతి ప్రయత్నాన్ని చూసిన ఓ బాలిక చూసింది. పిల్లిని కాపాడేందుకు బావిలోకి దిగింది. ఆ పిల్లిని తన చేతులతో ఎత్తుకొని బయటకు తీసి, ఆ కోతికి అందించింది.
తరువాత కూడా ఆ కోతి పిల్లి పట్ల ఎంతో ప్రేమ చూపించింది. దానిని ఆప్యాయంగా నిమిరింది. పిల్లి శరీరానికి అంటుకున్న బురదను తీసేందుకు ప్రయత్నించింది. ఆ బాలిక కూడా ఓ బట్ట తీసుకొని పిల్లి శరీరాన్ని శుభ్రం చేసింది. ఆ సమయంలో కూడా వానరం పిల్లిని ఆలింగనం చేసుకునేందుకు ప్రయత్నింది. ఈ పరిణామం మొత్తాన్ని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ వీడియోను 2 మిలియన్లకు పైగా వీక్షించారు.
సామాజిక న్యాయం, సాధికారత కోసం కుల గణన చేపట్టండి - ప్రధాని మోడీకి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే లేఖ
ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘అచత్యంత హృదయవిదారకమైన కోతి రెస్క్యూను చూడండి’ ఓ ట్విట్టర్ యూజర్ కామెంట్ చేశారు. ‘మానవులు నిజంగా జంతువుల నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు’ అని మరకొరు పేర్కొన్నారు.