మథురలో సన్యాసి వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి ఐదేళ్ల బాలుడిని నేలకేసి కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఇది గమనించిన స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.  

ఉత్తరప్రదేశ్‌ : ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. సన్యాసి వేషంలో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి 5 ఏళ్ల బాలుడిని కొట్టి నేలకేసి కొట్టి చంపేశాడు. మథురలోని గోవర్ధన్ ప్రాంతంలోని రాధాకుండ్ కమ్యూనిటీ సెంటర్ సమీపంలో బాలుడు తన ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో ఆ వ్యక్తి అతనిపై దాడి చేశాడు.

ఇది గమనించిన స్థానికులు దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. చిన్నారిని సాధువులాంటి వ్యక్తి చంపడంతో ఈ హత్య ఆ ప్రాంతంలో కలకలం రేపింది. స్థానికులు ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఉత్తరాఖండ్ లో వర్ష బీభత్సం.. కూలిన డెహ్రాడూన్ తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయం..

సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలో నమోదైన ఘటన ప్రకారం.. ఆ వ్యక్తి రోడ్డుమీద వెడుతూ.. మార్గమధ్యంలో చిన్నారి వద్దకు వచ్చి అకస్మాత్తుగా దాడి చేసినట్లుగా కనిపిస్తుంది. ముందు చిన్నారి దగ్గరికి వచ్చి.. అతని కాలు పట్టుకుని నేలకేసి కొట్టాడు. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడని, పోస్టుమార్టం కోసం వేచి చూస్తున్నామని పోలీసులు తెలిపారు.

పోస్ట్‌మార్టం నిర్వహించి, కేసు నమోదు చేసిన తర్వాత నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్ వ్యక్తుల వాంగ్మూలాలను ధృవీకరిస్తుంది. దీనిమీద క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తాం" అని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రూరల్) త్రిగుణ్ బిసెన్ తెలిపారు.