ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానల వల్ల కొండ చరియలు కూడా విరిగి పడుతున్నాయి. దీంతో జన జీవనం అస్థవ్యస్థంగా మారింది. డెహ్రాడూన్ లో ఉన్న ప్రఖ్యాత తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయంలోని కొంత భాగం కూలింది.
ఉత్తరాఖండ్ లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీని వల్ల జన జీవనం అస్తవ్యస్తంగా తయారు అయ్యింది. అనేక మంది నిరాశ్రయులయ్యారు. కాగా.. ఈ వర్షాలకు ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లోని ప్రసిద్ధ తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయంలో కొంత భాగం కూలిపోయింది. సోమవారం సావన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పూజలు చేసేందుకు వచ్చిన భక్తులు చెట్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
డెహ్రాడూన్ సమీపంలోని లంగా రోడ్డులోని మద్రాస్ గ్రామ పంచాయతీలోని జఖాన్ గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో 15 ఇళ్లు కూలిపోగా, ఏడు గోశాలలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదని అధికారులు తెలిపారు. కాగా.. త వారం డెహ్రాడూన్ లోని కలువాలా ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో అనేక మంది ఇబ్బందులు పడ్డారు.
అంతకు ముందు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. రిషికేష్ లో పెరుగుతున్న గంగా నది నీటి మట్టాన్ని సమీక్షించారు. ఈ రుతుపవనాల కారణంగా ఉత్తరాఖండ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి పలు చోట్ల ఆకస్మిక వరదలు సంభవించాయి.
