Asianet News TeluguAsianet News Telugu

పైప్ నిండా నోట్ల కట్టలే.. అవాక్కైన అధికారులు, ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

కర్ణాటకలో ఓ అధికారి ఏకంగా తన అవినీతి సంపాదనను పైప్‌లైన్‌లో ( pipe ) దాచి వుంచాడు. అయినప్పటికీ ఏసీబీ (Anti Corruption Bureau) అధికారులు దానిని పట్టేశారు. కలబురిగి (Kalaburagi ) జిల్లా పీడబ్ల్యూడీ జాయింట్‌ ఇంజినీర్‌ (PWD engineer) శాంతా గౌడ్‌ బిరదర్‌ ( Shanthanagouda Biradar ) ఇంట్లో సోదాలు చేసిన అధికారులు అతడి అక్రమ సంపాదన చూసి అవాక్కయ్యారు. 

Money spills out of pipe line during ACB raid on Karnataka PWD junior engineer in Kalaburagi
Author
Kalaburagi, First Published Nov 24, 2021, 9:34 PM IST

ప్రభుత్వం నుంచి భారీగా జీతభత్యాలు వస్తున్నా కొందరు అక్రమార్కులు దొడ్డిదారిన సంపాదిస్తున్నారు. లక్షలు, కోట్లలో లంచాలు (bribe) వసూలు చేస్తూ వాటిని దాచేందుకు తిప్పలు పడుతున్నారు. ఇంటి గోడల్లోనో, బాత్‌రూమ్‌లోనో ఆ డబ్బును దాచిన ఘటనలు మనం ఎన్నో చూశాం. తాజాగా కర్ణాటకలో ఓ అధికారి ఏకంగా తన అవినీతి సంపాదనను పైప్‌లైన్‌లో ( pipe ) దాచి వుంచాడు. అయినప్పటికీ ఏసీబీ (Anti Corruption Bureau) అధికారులు దానిని పట్టేశారు. 

వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలో (Karnataka) ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు అధికారుల ఇళ్లల్లో ఏసీబీ బుధవారం సోదాలు జరిపింది. ఈ నేపథ్యంలో కలబురిగి (Kalaburagi ) జిల్లా పీడబ్ల్యూడీ జాయింట్‌ ఇంజినీర్‌ (PWD engineer) శాంతా గౌడ్‌ బిరదర్‌ ( Shanthanagouda Biradar ) ఇంట్లో సోదాలు చేసిన అధికారులు అతడి అక్రమ సంపాదన చూసి అవాక్కయ్యారు. ఈ సోదాల్లో ఆయన ఇంట్లో రూ. 25 లక్షల నగదు, పెద్ద మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు.

ALso Read:ఏసిబికి చిక్కిన మరో అవినీతి తిమింగలం... కోట్లల్లో అక్రమాస్తులు

శాంతాగౌడ్‌ తన ఇంట్లో ఉన్న పైపులైన్లలో నగదు దాచి ఉంచాడన్న సమాచారం అందుకున్న అధికారులు.. ఓ ప్లంబర్‌ను తీసుకొచ్చి వాటిని పగులగొట్టించారు. దీంతో పైపులైన్‌ నుంచి కరెన్సీ నోట్లు కిందకు పడటం చూసి అధికారులు అవాక్కయ్యారు. నల్లధనం కోసమే ఈ పైపులను ఇంట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు ఏసీబీ అధికారులు  గుర్తించారు.  కాగా.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది అధికారులకు సంబంధించిన నివాసాలపై ఏసీబీ అధికారులు 60 చోట్ల సోదాలు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios