మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయి ఢిల్లీలో మండోలి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్‌ సెల్ లో లగ్జరీ వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో నిందితుడు ఓ మూలన నిలబడి కన్నీళ్లు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.  

రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన సీసీటీవీ వీడియో గురువారం బయటపడింది. ఆ వీడియోలో నిందితుడి జైలు గదిపై జైలు అధికారులు దాడి చేసినట్టు కనిపిస్తోంది. ఆ సమయంలో ఆ గది నుంచి విలాసవంతమైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ వీడియోలో సుకేష్ ఏడుస్తూ కన్నీళ్లు తుడుచుకోవడం కూడా రికార్డు అయ్యింది.

ఒక వైపు కోవిడ్.. మ‌రోవైపు వైర‌ల్ వ్యాధులు.. చైనాలో మూత‌ప‌డ్డ పాఠ‌శాల‌లు

కాగా, సుకేష్ చంద్రశేఖర్ సీసీటీవీ ఫుటేజీని లీక్ చేసిన వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని జైలు అధికారులు తెలిపారు. మీడియా కథనాల ప్రకారం.. జైలు అధికారులు అతడి సెల్ నుండి రూ.1.5 లక్షల విలువైన గుచ్చి చెప్పులు, రూ.80,000 విలువైన రెండు జతల జీన్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. సుకేష్ చంద్రశేఖర్ సెల్‌లో ఆకస్మిక సోదాలు నిర్వహించిన సమయంలో జైలు అధికారులతో పాటు సీఆర్పీఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారు.

ప‌వ‌న్ ఖేరా అరెస్ట్.. ఇది నియంతృత్వం కాక‌పోతే మ‌రేంటి..? : బీజేపీపై కాంగ్రెస్ ఫైర్

200 కోట్లు మోసం చేసిన సుకేష్(32)ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపై దేశవ్యాప్తంగా 20కి పైగా కేసులు నమోదయ్యాయి. 2017లో అన్నాడీఎంకే శశికళ శిబిరానికి రెండు ఆకుల పార్టీ చిహ్నాన్ని ఇవ్వకుండా మోసం చేసినందుకు అరెస్టయ్యాక ఆయన వెలుగులోకి వచ్చారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఆఫ్ ఢిల్లీ పోలీసులు రాజధానిలోని అతడి గదిలో సుమారు రూ.1.25 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. 2021లో మాజీ 
మాజీ రెలిగేర్ ప్రమోటర్ మల్వీందర్ సింగ్ భార్యను కేంద్ర హోం, లా సెక్రటరీలుగా చూపించి రూ.200 కోట్లు మోసం చేసిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల చంద్రశేఖర్‌ను అరెస్టు చేసింది.

Scroll to load tweet…

33 ఏళ్ల చంద్రశేఖర్‌ను గత వారం స్థానిక జైలు నుంచి మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) క్రిమినల్ సెక్షన్ల కింద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఢిల్లీ కోర్టు అతడిని తొమ్మిది రోజుల ఈడీ కస్టడీకి పంపింది. సుకేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసు దర్యాప్తు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి, నిక్కీ తంబోలి, సోఫియా సింగ్, అరుషా పాటిల్ మరియు చాహత్ ఖన్నాతో సహా పలువురు ప్రముఖులను వెలుగులోకి తెచ్చింది.