నేటి ముఖ్యాంశాలివే...

Monday 29 August Telugu News Live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...
 
4:18 PM IST

రాజాసింగ్ జైల్లో, నుపుర్ శర్మ ఇంట్లో వుండటానికి కారణమదే..: ఎంఐఎం చీఫ్ అసదుద్దిన్

గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ పై ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసి కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వుండబట్టే మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎమ్మెల్యే జైల్లో వున్నాడని అసదుద్దిన్ ఓవైసి పేర్కొన్నారు. డిల్లీలో లా ఆండ్ ఆర్డర్ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో వుంది కాబట్టే నుపుర్ శర్మపై ఎలాంటి చర్యలు లేవని అసద్ పేర్కొన్నారు. 

3:07 PM IST

పాడి రైతులకు విజయ డెయిరీ శుభవార్త...

పాడి రైతులకు విజయ డెయిరీ గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల నుండి సేకరించే గేదె పాలు మూడు రూపాయలు (46.69 రూపాయల నుండి 49.40 రూపాయలకు పెంపు), ఆవు పాలు 5 రూపాయలు (33.75 రూపాయల నుండి 38.75 రూపాయలకు పెంపు) పెంచినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 

1:50 PM IST

ప్రగతి భవన్ నుండి పెద్దపల్లికి బయలుదేరిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ లోని ప్రగతి భవన్ నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి జిల్లా పర్యటనకు బయలుదేరారు. పెద్దపల్లిలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ ను సీఎం ప్రారంభించనున్నారు. అలాగే జిల్లా టీఆర్ఎస్ కార్యాలయాన్ని కూడా ఆయన ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. 
 
1:05 PM IST

న్యూడ్ ఫోటో షూట్ వివాదం... రన్వీర్ సింగ్ స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు

న్యూడ్ ఫోటో షూట్ కేసులో బాలీవుడ్ స్టార్ రన్వీర్ సింగ్ పై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ముంబై పోలీసులు తాజాగా అతడి స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసారు.  సోషల్ మీడియాలో తన అశ్లీల ఫోటోలను పోస్ట్ చేసినందుకు రన్వీర్ పై ఓ ఎన్జీవో సంస్థ చెంబూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

12:09 PM IST

తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్... మాజీ ఎంపీ రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. రెండుసార్లు రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన తెలంగాణ సీనియర్ నాయకులు ఎంఎ ఖాన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు. కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి క్యాడర్ తో సత్సంబంధాలను కలిగివుండటం లేదని... దీంతో పూర్వవైభవం పొందుతామన్న ఆశ ప్రజల్లో ఏమాత్రం లేకుండా పోయిందని తన రాజీనామా లేఖలో ఖాన్ పేర్కొన్నారు. 

11:34 AM IST

ముంబై వినాయకుడికి రూ.316.4 కోట్ల ఇన్సూరెన్స్...

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వినాయక చవితి వేడుకలను ఎంత వైభవంగా నిర్వహిస్తారో తెలియజేసే సంఘటన ఇది. వినాయక నవరాత్రి ఉత్సవాల కోసం ముంబై లోని కింగ్ సర్కిల్ లో ఏర్పాటుచేసే మండపానికి నిర్వహకులు రూ.316.4 కోట్ల ఇన్సూరెన్స్ చేయించారు.  కేవలం మండపం, వినాయక విగ్రహం, ఆభరణాలకే కాదు దర్శనానికి వచ్చే భక్తులకు కూడా ఇన్సూరెన్స్ కవరయ్యేలా చూసామని నిర్వహకులు తెలిపారు.  
 
10:49 AM IST

ఎన్డీఏలో కూటమిలోకి టిడిపి...: ఎంపీ రఘురామ సంచలనం

వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ రాజకీయ పరిణామాలపై  కీలక వ్యాఖ్యలు చేసారు. బిజెపి ఆధ్వర్యంలోనే ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరబోతోందని అన్నారు. ఇందుకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం తనకు అదిందని రఘురామ పేర్కొన్నారు. 
 
10:11 AM IST

బ్లాక్ మండే... దేశీయ స్టార్ మార్కెట్ల భారీ పతనం

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఆరంభంలోనే కుప్పకూలాయి. సోమవారం ఆరంభంలోనే సెన్సెక్స్ ఏకంగా 1,034 పాయింట్లు నష్టపోయి 57,815 వద్దకు చేరుకుంది. ఇక నిప్టీ కూడా 300 పాయింట్ల నష్టంతో 17,258కి చేరింది. 

9:33 AM IST

మైనర్ కొడుకు ముందే తల్లిపై గ్యాంగ్ రేప్.. అమిత్ షా దే బాధ్యత: టీఎంసి

పశ్చిమ బెంగాల్ లో ఇద్దరు బిఎస్ఎఫ్ జవాన్లు ఓ మహిళపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని బగ్దా బార్డర్ ఔట్ పోస్ట్ వద్ద మైనర్  కొడుకుతో కలిసి వెళుతున్న మహిళపై బిఎస్ఎఫ్ లో పనిచేసే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళ మైనర్ కొడుకు ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై అధికార తృణమూల్ కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుని కేంద్రంపై విమర్శలు చేస్తోంది. 
 
9:21 AM IST

నేడు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

వర్షాకాలం ఆరంభంలో తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు ముంచెత్తగా కొంతకాలంగా ముఖం చాటేసాయి. తాజాగా తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని... దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ విభాగం ప్రకటించింది. 

4:19 PM IST:

గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ పై ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసి కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వుండబట్టే మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎమ్మెల్యే జైల్లో వున్నాడని అసదుద్దిన్ ఓవైసి పేర్కొన్నారు. డిల్లీలో లా ఆండ్ ఆర్డర్ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో వుంది కాబట్టే నుపుర్ శర్మపై ఎలాంటి చర్యలు లేవని అసద్ పేర్కొన్నారు. 

4:19 PM IST:

గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ పై ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసి కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వుండబట్టే మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎమ్మెల్యే జైల్లో వున్నాడని అసదుద్దిన్ ఓవైసి పేర్కొన్నారు. డిల్లీలో లా ఆండ్ ఆర్డర్ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో వుంది కాబట్టే నుపుర్ శర్మపై ఎలాంటి చర్యలు లేవని అసద్ పేర్కొన్నారు. 

3:08 PM IST:

పాడి రైతులకు విజయ డెయిరీ గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల నుండి సేకరించే గేదె పాలు మూడు రూపాయలు (46.69 రూపాయల నుండి 49.40 రూపాయలకు పెంపు), ఆవు పాలు 5 రూపాయలు (33.75 రూపాయల నుండి 38.75 రూపాయలకు పెంపు) పెంచినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 

1:50 PM IST:

హైదరాబాద్ లోని ప్రగతి భవన్ నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి జిల్లా పర్యటనకు బయలుదేరారు. పెద్దపల్లిలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ ను సీఎం ప్రారంభించనున్నారు. అలాగే జిల్లా టీఆర్ఎస్ కార్యాలయాన్ని కూడా ఆయన ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. 
 
1:06 PM IST:

న్యూడ్ ఫోటో షూట్ కేసులో బాలీవుడ్ స్టార్ రన్వీర్ సింగ్ పై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ముంబై పోలీసులు తాజాగా అతడి స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసారు.  సోషల్ మీడియాలో తన అశ్లీల ఫోటోలను పోస్ట్ చేసినందుకు రన్వీర్ పై ఓ ఎన్జీవో సంస్థ చెంబూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

12:10 PM IST:

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. రెండుసార్లు రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన తెలంగాణ సీనియర్ నాయకులు ఎంఎ ఖాన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు. కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి క్యాడర్ తో సత్సంబంధాలను కలిగివుండటం లేదని... దీంతో పూర్వవైభవం పొందుతామన్న ఆశ ప్రజల్లో ఏమాత్రం లేకుండా పోయిందని తన రాజీనామా లేఖలో ఖాన్ పేర్కొన్నారు. 

11:35 AM IST:

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వినాయక చవితి వేడుకలను ఎంత వైభవంగా నిర్వహిస్తారో తెలియజేసే సంఘటన ఇది. వినాయక నవరాత్రి ఉత్సవాల కోసం ముంబై లోని కింగ్ సర్కిల్ లో ఏర్పాటుచేసే మండపానికి నిర్వహకులు రూ.316.4 కోట్ల ఇన్సూరెన్స్ చేయించారు.  కేవలం మండపం, వినాయక విగ్రహం, ఆభరణాలకే కాదు దర్శనానికి వచ్చే భక్తులకు కూడా ఇన్సూరెన్స్ కవరయ్యేలా చూసామని నిర్వహకులు తెలిపారు.  
 
10:50 AM IST:

వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ రాజకీయ పరిణామాలపై  కీలక వ్యాఖ్యలు చేసారు. బిజెపి ఆధ్వర్యంలోనే ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరబోతోందని అన్నారు. ఇందుకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం తనకు అదిందని రఘురామ పేర్కొన్నారు. 
 
10:11 AM IST:

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఆరంభంలోనే కుప్పకూలాయి. సోమవారం ఆరంభంలోనే సెన్సెక్స్ ఏకంగా 1,034 పాయింట్లు నష్టపోయి 57,815 వద్దకు చేరుకుంది. ఇక నిప్టీ కూడా 300 పాయింట్ల నష్టంతో 17,258కి చేరింది. 

9:34 AM IST:

పశ్చిమ బెంగాల్ లో ఇద్దరు బిఎస్ఎఫ్ జవాన్లు ఓ మహిళపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని బగ్దా బార్డర్ ఔట్ పోస్ట్ వద్ద మైనర్  కొడుకుతో కలిసి వెళుతున్న మహిళపై బిఎస్ఎఫ్ లో పనిచేసే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళ మైనర్ కొడుకు ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై అధికార తృణమూల్ కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుని కేంద్రంపై విమర్శలు చేస్తోంది. 
 
9:22 AM IST: