భారత్ జోడో యాత్ర మొదలు పెట్టిన 15 రోజుల వ్యవధిలోనే ఆ యాత్ర ప్రభావం కనిపిస్తోందని కాంగ్రెస్ తెలిపింది. ఈ యాత్ర వల్లే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముస్లిం మత పెద్దలను కలుస్తున్నారని పేర్కొంది. 

భారత్ జోడో యాత్ర ప్రభావం వల్లే ముస్లిం మత పెద్దలతో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భేటీ అయ్యారని కాంగ్రెస్ పేర్కొంది. దేశాన్ని ఏకం చేయడంలో రాహుల్ గాంధీతో కలిసి రావాలని కోరింది. ఈ మేరకు ఆ పార్టీ నేత గౌరభ్ వల్లభ్ మీడియాతో గురువారం మాట్లాడారు. భారత్ జోడో యాత్ర ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. 

మధ్యప్రదేశ్ లో దారుణం.. చిన్నారులతో టాయిలెట్లు శుభ్రం చేయించిన టీచర్..

‘‘ భారత్ జోడో యాత్ర ప్రారంభమై కేవలం 15 రోజులు మాత్రమే అవుతోంది. అయితే దాని ఫలితాలు మొదటి సారిగా వెలువడ్డాయి. బీజేపీ అధికార ప్రతినిధి టీవీలో (నాథూరామ్) గాడ్సే ముర్దాబాద్ అని అన్నారు. అలాగే మోహన్ భగవత్ వేరే మతానికి చెందిన వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. ఇదే భార‌త్ జోడో యాత్ర ప్ర‌భావం ’’ అని వల్లభ్ అన్నారు. 

భారత్ జోడో యాత్ర ముగిసే సమయానికి దేశంలోని పాలకవర్గం సృష్టించిన విద్వేషాలు, విభేదాలు తొలగిపోతాయని ఆయన అన్నారు. ‘‘ ఈ 15 రోజుల యాత్ర మీపై అంత ప్రభావం చూపించింది. మీరు భారత్ జోడో యాత్రలో ఒక గంట పాటు పాల్గొనండి. చేతిలో త్రివర్ణ పతాకం పట్టుకొని రాహుల్ గాంధీతో కలిసి నడవాలని మేము మోహన్ భగవత్‌ను కోరుతున్నాము ’’ అని ఆయన అన్నారు. 

దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. నగ్నంగా నడుచుకుంటూ వెళ్తున్న వీడియో వైరల్.. ట్విస్ట్ ఇచ్చిన తల్లిదండ్రులు

ఇదే విషయంపై కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా కూడా స్పందించారు. ‘‘ భారత్ జోడో యాత్ర ప్రారంభించి 15 రోజులు మాత్రమే అయ్యింది. బీజేపీ ప్రతినిధి ఒక‌రు నాథురామ్ గాడ్సెను ముర్దాబాద్ అని అన్నారు. మీడియా ద్వారా వ్యాపించిన ద్వేషంపై మంత్రులు ఆందోళన చెందారు.భగవత్ ఇమామ్‌లకు చేరువయ్యారు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం.’’ అని అన్నారు. 

గురువారం ఢిల్లీలో ఉన్న కస్తూర్బా గాంధీ మార్గ్ లో ఉన్న మసీదులో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసీని కలిశారు. దాదాపు గంటకు పైగా త‌లుపులు వేసుకొని వారి మ‌ధ్య స‌మావేశం జ‌రిగింది. మోహ‌న్ భ‌గ‌వ‌త్ వెంట సంఘ్ సీనియర్ కార్యకర్తలు కృష్ణ గోపాల్, రామ్ లాల్, ఇంద్రేష్ కుమార్‌లు ఉన్నారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డి పిల్ల‌ల‌తో కూడా భ‌గ‌వత్ సంభాషించారు.

ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం.. సోషల్ మీడియాలో యూజర్ల రచ్చ..

ఈ హిజాబ్ వివాదం, జ్ఞానవాపి, మతాల మధ్య శాంతి, సామరస్యాన్ని కాపాడటం వంటి అంశాలపై సమావేశంలో చర్చ‌లు జ‌రిగాయ‌ని ఆర్ఎస్ఎస్ వ‌ర్గాలు ANI తో తెలిపాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ గత కొన్ని రోజులుగా మత సామరస్యాన్ని బలోపేతం చేయడానికి, అంతర్గత సంబంధాలను మెరుగుపరచడానికి ముస్లిం మేధావులను కలుస్తున్నార‌ని ఆర్‌ఎస్‌ఎస్ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ అన్నారు. ‘‘ ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘచాలక్ అన్ని వర్గాల ప్రజలను కలుస్తారు. ఇది నిరంతర సాధారణ ‘సంవాద్’ ప్రక్రియలో భాగం ’’ అని ఆయన చెప్పారు.