Asianet News TeluguAsianet News Telugu

మధ్యప్రదేశ్ లో దారుణం..  చిన్నారులతో టాయిలెట్లు శుభ్రం చేయించిన టీచర్..

మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లా చక్‌దేవ్‌పూర్ గ్రామంలోని ప్రభుత్వ స్కూల్‌లో దారుణం వెలుగుచూసింది. బాలికలతో టాయిలెట్లను శుభ్రం చేయించారు.బాలికలు టాయిలెట్లు క్లీనింగ్‌ చేస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.
 

Girls Cleaning Toilets At Madhya Pradesh Government School
Author
First Published Sep 23, 2022, 6:15 AM IST

మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో సిగ్గుమాలిన ఘటన వెలుగు చూసింది.చక్‌దేవ్‌పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బాలికలతో టాయిలెట్లను శుభ్రం చేయించారు. బాలికలు చీపురు పట్టి టాయిలెట్‌ను శుభ్రం చేస్తూ, కడుక్కుంటున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకెళ్తే.. శివరాజ్ ప్రభుత్వంలోని పంచాయతీ గ్రామీణ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా అసెంబ్లీ నియోజవర్గంలోని చక్‌దేవ్‌పూర్ గ్రామ  ప్రభుత్వ పాఠశాల. ఈ పాఠశాలలో ఐదు,ఆరు తరగతి చదివే కొందరు బాలికలతో స్కూల్‌ టాయిలెట్‌ను మంగళవారం శుభ్రం చేయించారు. చేతిలో పుస్తకాలు ఉండాల్సిన విద్యార్థినులు  చీపుర్లు చేత పట్టి మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్నారంటే నిస్పృహ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వారి నీటి కోసం దూరంలో ఉన్న హ్యాండ్‌ పంప్‌ ను వినియోగిస్తున్నారు. ఈ విషయంపై స్థానిక మీడియాలో ఈ వార్తలు వచ్చాయి. బాలికలు టాయిలెట్లు క్లీనింగ్‌ చేస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

ఈ విషయం గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇందిరా రఘువంశీ మాట్లాడానికి నిరాకరించారు.అదే సమయంలో ఈ ఘటనపై గుణ కలెక్టర్ ఫ్రాంక్ నోబుల్ మాట్లాడుతూ.. ఈ విషయం దృష్టికి వచ్చిందని, దర్యాప్తుకు ఆదేశించినట్టు తెలిపారు. సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామనీ, విద్యార్థినుల పట్ల ఇలాంటి ప్రవర్తన అస్సలు సహించేది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, ఆ రాష్ట్ర పంచాయతీ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా ఈ సంఘటనపై స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు విద్యా శాఖకు ఈ ఘటనపై చాలా సీరియస్  అయ్యింది. అధికారుల బృందం ఆ పాఠశాలలో పర్యవేచ్చింది.ఈ సంఘటనపై వేరుగా దర్యాప్తు చేస్తున్నది. అయితే ఆ స్కూల్‌ ప్రధానోపాద్యాయుడు  అధికార సమావేశం కోసం గుణ టౌన్‌కు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగినట్లు ఒక అధికారి తెలిపారు.   

Follow Us:
Download App:
  • android
  • ios