మహమ్మద్ షమీకి అర్జున అవార్డు: ఐదుగురికి ద్రోణాచార్య అవార్డులు
కేంద్ర ప్రభుత్వం ఇవాళ పలువురు క్రీడాకారులకు అవార్డులను ప్రకటించింది.
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు సభ్యుడు మహమ్మద్ షమీకి కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డును ప్రకటించింది. భారత ప్రభుత్వం పలువురు క్రీడాకారులకు అవార్డులను ప్రకటించింది. భారత క్రికెట్ జట్టు సభ్యుడు మహమ్మద్ షమీకి కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డును ప్రకటించింది. భారతదేశం యొక్క రెండవ అత్యున్నత క్రీడా గౌరవం అర్జున అవార్డు. క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శనకు అర్జున అవార్డులను ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. పురుషుల ప్రపంచ కప్ క్రికెట్ క్రికెట్ 2023 లో మహమ్మద్ షమీ అద్భుతమైన ప్రతిభను కనబర్చారు. ఐసీసీ వరల్డ్ కప్ లో కేవలం ఏడు ఇన్నింగ్స్ లలో 24 వికెట్లతో మహమ్మద్ షమీ అగ్రస్థానంలో నిలిచాడు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 33 ఏళ్ల కుడిచేతి పేసర్ వన్ డే క్రికెట్ లో 19 ఇన్నింగ్స్ లలో 43 వికెట్లను సాధించాడు. రెడ్ బాల్ క్రికెట్ లో నిలకడగా ఆయన ప్రదర్శనలు ఇస్తున్నాడు. ఈ ఏడాది భారత జట్టును ప్రపంచంలో నెంబర్ వన్ జట్టుగా నిలబెట్టడంలో మహమ్మద్ షమీ కీలక పాత్ర పోషించాడు.
మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డులు
1. చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి
2. రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ (బ్యాడ్మింటన్)
అర్జున అవార్డులు
1. ఓజోస్ ప్రవీణ్ డీయోటలే ( ఆర్చరీ)
2.ఆదితి గోపిచంద్ స్వామి (ఆర్చరీ)
3.శ్రీశంకర్ ( అథ్లెటిక్స్)
4.మహమ్మద్ హుస్సముద్దీన్ (బాక్సింగ్)
5.ఆర్.వైశాలి (చెస్)
6.అనుష్ అగర్వాల్
7.దివ్వకృతి సింగ్
8. దిక్షా దగర్ (గోల్ఫ్)
9. కృషన్ బహదూర్ పాఠక్ (హాకీ)
10.పుకురంబాం సుశీల చాన్ (హాకీ)
11.పవన్ కుమార్ (కబడ్డీ)
12. రితూ నేగీ (కబడ్డీ)
13.నస్రీన్ (ఖోఖో)
14.ఎం.ఎస్ పింకి
15. ప్రతాప్ సింగ్ తోమర్ (షూటింగ్)
16. ఎం.ఎస్.ఈషా సింగ్ (షూటింగ్)
17. హరీందర్ పాల్ సింగ్ సంధు
18.ముఖర్జీ (టేబుల్ టెన్నిస్)
19.సునీల్ కుమార్ (రెజ్లింగ్)
20.ఎం.ఎస్. అంటిమ్ (రెజ్లింగ్)
21. రోషిబోయిన దేవి
22. షీతల్ దేవి (పారా ఆర్చరీ)
23. అజయ్ కుమార్ రెడ్డి (అంధ క్రికెట్)
24. ప్రచీ యాదవ్
ద్రోణాచార్య అవార్డులు
1. లలిత్ కుమార్ (రెజ్లింగ్)
2.ఆర్. బీ. రమేష్ (చెస్)
3. మహావీర్ ప్రసాద్ సైనీ ( పారా అథ్లెటిక్స్)
4.శివేంద్ర సింగ్ (హాకీ)
5. గణేష్ ప్రభాకర్ దేవ్రుకర్