Modi US visit 2023: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూఎస్ ప్రథమ మహిళ జిల్ బైడెన్  సహా వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని  వైట్ హౌస్ కు ప్ర‌యివేటు డిన్నర్ కు ఆహ్వానించారు. భారత నాయకత్వం రాక సందర్భంగా సాయంత్రం బహుమతుల మార్పిడితో పాటు ప్ర‌ధాని మోడీకి ఘనస్వాగతం లభించింది. ప్రధాని మోడీ కోసం 'అద్భుతమైన శాఖాహార' భోజనాన్ని సిద్ధం చేయాలని జిల్ బైడెన్ చెఫ్ ల‌ను ఆదేశించినట్లు సంబంధ‌త అధికారులు పేర్కొన్నారు. 

PM Modi in US: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూఎస్ ప్రథమ మహిళ జిల్ బైడెన్ సహా వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని వైట్ హౌస్ కు ప్ర‌యివేటు డిన్నర్ కు ఆహ్వానించారు. భారత నాయకత్వం రాక సందర్భంగా సాయంత్రం బహుమతుల మార్పిడితో పాటు ప్ర‌ధాని మోడీకి ఘనస్వాగతం లభించింది. ప్రధాని మోడీ కోసం 'అద్భుతమైన శాఖాహార' భోజనాన్ని సిద్ధం చేయాలని జిల్ బైడెన్ చెఫ్ ల‌ను ఆదేశించినట్లు సంబంధ‌త అధికారులు పేర్కొన్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ బుధవారం వైట్ హౌస్ లో ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక విందు ఇచ్చారు. ప్ర‌ధాని మోడీ ఈ విష‌యాన్ని ట్విట్టర్ వేదిక‌గా వెల్ల‌డించారు. 'ఈ రోజు వైట్ హౌస్ లో నాకు ఆతిథ్యం ఇచ్చినందుకు @POTUS @JoeBiden, @FLOTUS @DrBiden ధన్యవాదాలు. పలు అంశాలపై మేమిద్దరం గొప్ప చర్చలు జరిపాం' అని మోడీ ట్వీట్ చేశారు.

Scroll to load tweet…

అలాగే, "ఫ్రెండ్స్ కలిసినప్పుడు! @POTUS @JoeBiden, @FLOTUS @DrBiden, కుటుంబ సభ్యులతో గడిపేందుకు ప్రధాని న‌రేంద్ర మోడీ @WhiteHouse చేరుకున్నారు. సన్నిహిత బంధాలను పంచుకునే ఇద్దరు నేతలు కలిసి ప్రత్యేక క్షణాలను ఆస్వాదించే సందర్భం' అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. 2023 జూన్ 21న వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్ నిర్వహించిన ప్ర‌యివేటు డిన్న‌ర్ కు ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. వారి కుటుంబ సభ్యులను కూడా ప్రధాని పరామర్శించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని పాల్గొనడం ఇరు దేశాల మధ్య ఉన్న ఆత్మీయ స్నేహాన్ని పునరుద్ఘాటిస్తోందన్నారు.

Scroll to load tweet…