PM Modi in US: అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు మంగళవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) అమెరికా చేరుకున్న ప్రధాని మోడీ 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో చారిత్రాత్మక కార్యక్రమానికి నేతృత్వం వహించారు.
Modi US visit 2023: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలోని వాల్ ఆఫ్ పీస్ వద్ద అమరులైన ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకులకు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం నివాళులు అర్పించారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకుల నిస్వార్థ సేవ ఎప్పటికీ మరువలేనిదని ఉద్ఘాటించారు.
అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు మంగళవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) అమెరికా చేరుకున్న ప్రధాని మోడీ 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో చారిత్రాత్మక కార్యక్రమానికి నేతృత్వం వహించారు. ప్రధానితో పాటు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 77వ సెషన్ అధ్యక్షుడు కసాబా కొరిసి, డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమీనా మహమ్మద్, న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఉన్నారు.
మరణించిన శాంతి పరిరక్షకుల గౌరవార్థం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో స్మారక గోడను ఏర్పాటు చేయాలని భారత్ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని ఈ నెల ప్రారంభంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. తన అమెరికా పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చిన మోడీ ఈ కార్యక్రమం ప్రారంభంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలోని నార్త్ లాన్ లో మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ''ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించే గౌరవం లభించింది. శాంతి, అహింస, సామరస్యం అనే ఆయన నిరంతర సందేశం మనకు మార్గనిర్దేశం చేస్తూ, స్ఫూర్తినిస్తూ ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తుంది'' అని మోడీ ట్వీట్ చేశారు.
