గంగానదిలో పవిత్ర స్నానం చేసిన తర్వాత మోడీ హారతి ఇచ్చి సంగమం వద్ద ప్రార్థనలు చేశారు. గంగ, యమున, సరస్వతీ నదుల సంగమం వద్ద మోడీ పూజలు చేశారు. 

ప్రయాగరాజ్: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళా సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం గంగానదిలో పవిత్ర స్నానం చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఆయన స్వాగతం చెప్పారు. 

గంగానదిలో పవిత్ర స్నానం చేసిన తర్వాత మోడీ హారతి ఇచ్చి సంగమం వద్ద ప్రార్థనలు చేశారు. గంగ, యమున, సరస్వతీ నదుల సంగమం వద్ద మోడీ పూజలు చేశారు. 

ఆ తర్వాత ఆయన ప్రయాగరాజ్ లోని స్వచ్ఛ్ కుంభ స్వచ్ఛ్ సేవలో పాల్గొన్నారు. పారిశుధ్య కార్మికులను కలిశారు. వారి పాదాలను కడిగి వారిని గౌరవించారు. స్వచ్ఛ్ కుంభ స్వచ్ఛ్ ఆభార్ లో పాల్గొన్నారు. 

దానికి ముందు ప్రధాని గోరక్ పూర్ లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించారు.

ఇప్పటి వరకు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తన మంత్రివర్గ సభ్యులతో పవిత్ర స్నానం ఆచరించారు. 

Scroll to load tweet…