Asianet News TeluguAsianet News Telugu

రూల్స్ అతిక్ర‌మించ‌ని ప్ర‌ధాని.. ప‌ది దాటింద‌ని మైక్ వాడ‌కుండానే మాట్లాడిన మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ రూల్స్ పాటించారు. రాత్రి సమయం పది గంటలు దాటిందని మైక్ ఉపయోగించలేదు. ఈ పరిణామం రాజస్థాన్ లో జరిగింది. 

Modi spoke without using the mic saying that the Prime Minister did not violate the rules.
Author
First Published Oct 1, 2022, 8:35 AM IST

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తాను ఒక సామాన్యుడినే అని అనేక సంద‌ర్భాల్లో నిరూపించారు. నిబంధ‌న‌లు పాటించ‌డంలో ఆయ‌న ముందుంటార‌ని, ఒక పౌరుడిలాగే బాధ్య‌తలు పాటిస్తార‌ని అంద‌రికీ తెలిసిందే. కొన్ని సార్లు స్వ‌యంగా ప్ర‌ధాని మోడీ బీచ్ ల‌లో ప్లాస్టిక్ బాటిల్స్, చెత్త ఏరుతూ క‌నిపిస్తుంటారు. ఈ చ‌ర్య‌లే ఆయ‌న సింప్లిసిటీ ఏంటో అంద‌రికీ తెలియ‌జేస్తాయి. 

తాజాగా మ‌రో ప‌ని చేసి దేశంలోని ప్ర‌తీ ఒక్క‌రికీ నిబంధ‌న‌లు ఒక్క‌టే అని నిరూపించారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. రాజస్థాన్‌లోని అబూ రోడ్‌లో శుక్ర‌వారం రాత్రి భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేశారు. ఈ స‌భ‌లో ప్ర‌ధాని పాల్గొని ప్ర‌సంగించాల్సి ఉంది. అయితే వేధిక వ‌ద్ద‌కు చేరుకున్న స‌మ‌యానికే రాత్రి 10 గంట‌లు దాటింది. అక్క‌డి నిబంధ‌న‌ల ప్ర‌కారం ప‌ది దాటితే మైక్ ల‌ను ఉప‌యోగించ‌కూడ‌దు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్ర‌ధాని మోడీ మైక్ ను ఉప‌యోగించ‌లేదు. ప్ర‌జ‌ల‌కు అభివాదం చేసి మైక్ వాడకుండానే మాట్లాడారు. 

కాగా.. శుక్ర‌వారం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ బిజీ బిజీగా గ‌డిపారు. రాజస్థాన్‌లోని అబూ రోడ్‌ను సందర్శించే ముందు ఆయ‌న గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలోని అంబాజీ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ఆర‌తి ఇచ్చారు. అంత‌కు ముందు ప్రార్థ‌న‌లు చేశారు. మాధ్యాహ్నం స‌మ‌యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉచిత రేషన్ పథకాన్ని ప్రారంభించారు. దీని వ‌ల్ల 80 కోట్ల మందికి పైగా ప్ర‌జ‌లు ల‌బ్ది పొందుతార‌ని చెప్పారు. 

గుజరాత్‌లోని అంబాజీలో రూ. 7,200 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వాటిని జాతికి అంకితం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. కాగా అదే ప్రాంతంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన 45,000 ఇళ్లకు శంకుస్థాపన చేశారు. ప్రసాద్ పథకం కింద అంబాజీ ఆలయం వద్ద తరంగ కొండ - అంబాజీ - అబూ రోడ్ న్యూ బ్రాడ్ గేజ్ లైన్, తీర్థయాత్ర సౌకర్యాల అభివృద్ధికి కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. ఈ కొత్త రైలు మార్గం 51 శక్తి పీఠాలలో ఒకటైన అంబాజీని సందర్శించే లక్షలాది మంది భక్తులకు ప్రయోజనం చేకూర్చ‌నుంది. 

ఇదిలా ఉండ‌గా.. ఈ కార్య‌క్ర‌మాల‌కు ముందు కూడా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కాన్వాయ్ ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో ఒక ప‌క్క‌కు ఆగిపోయింది. అంబులెన్స్‌కు దారి ఇచ్చింది. కాన్వాయ్ అహ్మదాబాద్ నుండి గాంధీనగర్‌కు వెళుతుండగా అటు నుంచి అంబులెన్స్ రావ‌డం గ‌మ‌నించిన అధికారులు..దానిని వెళ్ల‌నిచ్చేందుకు క్వాన్వాయ్ మొత్తం ట్రయల్స్ రోడ్డుకు ఒకవైపు అలైన్‌మెంట్‌లో ఆగిపోయాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios