‘మోడీ జీ.. ఈ కష్ట సమయంలో మీకు నా ప్రేమ, మద్దతు’- రాహుల్ గాంధీ
ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. ఈ కష్ట సమయంలో ప్రధానికి తన ప్రేమ, మద్దతు ఉంటుందని ట్వీట్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీ అనారోగ్యానికి గురయ్యారు. అస్వస్థతతో బుధవారం అహ్మదాబాద్‌లోని హాస్పిటల్ లో చేరారు. ఆమెకు ప్రస్తుతం అక్కడ చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమె అనారోగ్యం పట్ల ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ భావోద్వేగ మద్దతును అందించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
లోకాయుక్త బిల్లును ఆమోదించిన మహారాష్ట్ర అసెంబ్లీ.. ఈ చట్టం తీసుకొచ్చిన మొదటి రాష్ట్రంగా రికార్డు..
ఈ మేరకు ఆయన ట్వీట్టర్ లో “తల్లి, కొడుకు మధ్య ప్రేమ శాశ్వతమైనది. వెలకట్టలేనిది. మోడీ జీ, ఈ కష్ట సమయంలో నా ప్రేమ, మద్దతు మీకు ఉంది. మీ అమ్మ త్వరగా కోలుకుంటుందని ఆశిస్తున్నాను.” అంటూ ఆయన ట్వీట్ చేశారు.
కాగా...కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా ప్రధాని మోడీ తల్లి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘‘ఈ సమయంలో మనమందరం ఆయనకు తోడుగా ఉన్నాం’’ అని అన్నారు.
మంగళవారం రాత్రి హీరాబెన్ మోడీ ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం ఉదయం ఆమెను అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా హాస్పిటల్ లో చేర్చారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ‘‘ప్రధానమంత్రి తల్లి ప్రస్తుతం అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ లో చేరారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.’’ అని ఆ హాస్పిటల్ ప్రతినిధి తెలిపారు.
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ భద్రతపై కాంగ్రెస్ ఆందోళన.. కేంద్రానికి లేఖ..
కాగా.. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కైలాష్ నాథన్ హాస్పిటల్ కు చేరుకొని ఆమె ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. ఇదిలా ఉండగా.. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని కలవడానికి ప్రధాని మోడీ ఈ రోజు మధ్యాహ్నం గుజరాత్ కు బయలుదేరారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్ విమానాశ్రయ ప్రాంతాన్ని డ్రోన్లకు నో ఫ్లై జోన్ గా ప్రకటించామని, భద్రతను కూడా పెంచామని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇటీవల గుజరాత్ లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన ప్రధాని మోడీ తన తల్లిని కలిశారు. ఆమెతో ముచ్చటించారు.