గాల్వన్ లోయలో 20 మంది భారతీయ జవాన్ల త్యాగాలు వృథా పోవని చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 59 చైనా మొబైల్ యాప్‌లను నిషేధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Also Read:భారత సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి: మన్‌కీ బాత్‌లో మోడీ

వీటిలో టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, షేర్ ఇట్, హెలో, వైబో, డియూ క్లీనర్, డియూ బ్రౌజర్‌లున్నాయి. జూన్ 15న లఢఖ్‌లోని గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో చైనాపై గట్టి ప్రతీకారం తీర్చుకోవాలని దేశప్రజలు డిమాండ్ చేశారు. దీనితో పాటు చైనా వస్తువులు, యాప్‌లను నిషేధించాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది.

Also Read:అప్పటివరకు ఇంతే.. చైనా గూడ్స్‌ నిషేధంపై ప్రముఖుల అంచనా..

మరోవైపు ఇరు వర్గాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను తగ్గించడానికి రెండు దేశాలు యత్నిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో చైనా తన బలగాలను పెంచుతున్న కొద్దీ భారత్ కూడా ఎల్ఏసీ వెంబడి తన జవాన్లను మోహరిస్తూ పోతోంది. రెండు వైపులా భారీ ఎత్తున సైన్యం, ఆయుధ సంపత్తిని తరలించింది.