న్యూఢిల్లీ: చైనా నుంచి దిగుమతులు ఇప్పట్లో ఆగబోవని, మరికొంతకాలం కొనసాగవచ్చని భారతీయ ఆటోమొబైల్‌, ఔషధ రంగాల ప్రముఖులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా సరైన ప్రత్యామ్నాయ మార్గాలు లభించేదాకా ఇంతేనని వారు స్పష్టం చేస్తున్నారు.

చైనా దుశ్చర్యకు 20 మంది భారతీయ సైనికులు బలైపోయిన విషయం తెలిసిందే. ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడగా, దేశంలో చైనా వస్తూత్పత్తుల బహిష్కరణ నినాదం మార్మోగుతున్న సంగతీ విదితమే. 

ఈ నేపథ్యంలో భారత్‌కు వస్తున్న చైనా దిగుమతులను నిలిపేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు అది సాధ్యం కాదన్న అభిప్రాయాలు పరిశ్రమ నుంచి వ్యక్తమవుతున్నాయి. దేశంలోని ఆటో, ఫార్మా కంపెనీలకు కీలక ఉత్పత్తులు, ముడి సరుకు చైనా నుంచే వస్తున్నది. 

ముఖ్యంగా వాహన తయారీలో ప్రధానమైన విడిభాగాల కోసం దేశీయ ఆటో పరిశ్రమ చైనాపైనే ఆధారపడుతున్నది. 2018-19లో 17.6 బిలియన్‌ డాలర్ల విలువైన ఆటో విడి భాగాలు మనదేశానికి దిగుమతి అయ్యాయి. ఇందులో చైనా వాటా 4.75 బిలియన్‌ డాలర్లు. 

also read  పసిడి ధరలు తారాజూవ్వల్లా...దీపావళి కల్లా తులం బంగారం ఎంతంటే..? ...

కాగా, చైనా నుంచి దిగుమతులను తగ్గించాలంటే పరిశ్రమ, కేంద్ర ప్రభుత్వం కలిసి ముందుకు నడువాల్సిన అవసరం ఉందని భారతీయ ఆటోమోటివ్‌ కంపోనెంట్‌ తయారీదారుల సంఘం (ఏసీఎంఏ) డైరెక్టర్‌ జనరల్‌ విన్నీ మెహెతా అన్నారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసేలా ప్రభుత్వం సహరించాలన్నారు. 

లాక్‌డౌన్‌ కారణంగా ఆటోమోటివ్‌ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందని భారతీయ ఆటోమోటివ్‌ కంపోనెంట్‌ తయారీదారుల సంఘం (ఏసీఎంఏ) డైరెక్టర్‌ జనరల్‌ విన్నీ మెహెతా చెప్పారు. డ్రైవ్‌ ట్రాన్స్‌మిషన్‌, స్టీరింగ్‌ భాగాలు, ఎలక్ట్రానిక్‌-ఎలక్ట్రికల్‌ ఉత్పత్తులు, కూలింగ్‌ సిస్టమ్స్‌, సస్పెన్షన్‌, బ్రేకింగ్‌ భాగాలు తదితర ఉత్పత్తులు చైనా నుంచి ఎక్కువగా భారత్‌కు దిగుమతి అవుతున్నాయి.

‘చైనా నుంచి భారత్‌కు పలు అత్యవసర యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియెంట్స్‌ దిగుమతి అవుతున్నాయి. దిగుమతిదారులకు చైనా ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలు అంతర్జాతీయ మార్కెట్‌లో అత్యంత ఆకర్షణీయంగా ఉంటున్నాయి’ అని ఐపీఏ ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌ జైన్ పేర్కొన్నారు.

మారుతి సుజుకీ ఇండియా చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ ప్రతి స్పందిస్తూ.. ‘ఆటో విడిభాగాల ను విదేశాల నుం చి దిగుమతి చేసుకోవడానికి కారణం దేశంలో వాటి ఉత్పత్తి లేకపోవడం, నాణ్యమైనవి దొరుకకపోవడమే. ఒకవేళ లభ్యమైనా అధిక ధరలు అంటున్నాయి. కాబట్టి చైనా నుంచి ఈ దిగుమతులు ఆగిపోవాలంటే అందుకు తగ్గ ప్రత్యామ్నాయాలు భారత్‌లోనే ఉండాలి’ అని తేల్చి చెప్పరు.