New Delhi: కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సర్కారుపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు మోడీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్ యూలు) నాశనం చేస్తోందనీ, లక్షలాది మందిని ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం చేస్తోందని ఆరోపించారు. కేవలం ప్రచారం కోసమే మేకిన్ ఇండియా కార్యక్రమం తీసుకువచ్చారని విమర్శించారు.
Congress president Mallikarjun Kharge: కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సర్కారుపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు మోడీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్ యూలు) నాశనం చేస్తోందనీ, లక్షలాది మందిని ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం చేస్తోందని ఆరోపించారు. కేవలం ప్రచారం కోసమే మేకిన్ ఇండియా కార్యక్రమం తీసుకువచ్చారని విమర్శించారు.
వివరాల్లోకెళ్తే.. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసిన ఖర్గే.. ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేసి లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలను లాక్కున్న ప్రధాని నరేంద్ర మోదీ ఏ టూల్ కిట్ లో భాగమంటూ ప్రశ్నించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో పీఎస్ యూలు ఒక ముఖ్యమైన భాగమని మోడీ సర్కారు నమ్మడం లేదా? అంటూ ప్రశ్నించారు.
అలాగే, మోడీ ప్రభుత్వం ఏడు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి 3.84 లక్షల ఉద్యోగాలను తొలగించిందనీ, కేంద్ర ప్రభుత్వంలో మహిళల ఉపాధిని 42 శాతం తగ్గించిందని, కాంట్రాక్ట్ లేదా క్యాజువల్ ప్రభుత్వ ఉద్యోగాలను 88 శాతం పెంచిందని తన ట్వీట్ కు జత చేసిన వీడియో ప్రజెంటేషన్ లో డేటాతో పాటు సంబంధిత గ్రాఫ్ లను పంచుకున్నారు. కేవలం ఏడు పీఎస్ యూల నుంచి 3.84 లక్షల ఉద్యోగాలను మోడీ ప్రభుత్వం ఎందుకు లాక్కుందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంలో మహిళల ఉద్యోగాలు 42 శాతం ఎందుకు తగ్గాయి? కాంట్రాక్ట్/క్యాజువల్ ప్రభుత్వ ఉద్యోగాలు 88 శాతం ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు.
'మేక్ ఇన్ ఇండియా' ప్రచారంపై బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, "మేక్ ఇన్ ఇండియా" 'హై వోల్టేజ్ ప్రచారం' కేవలం ప్రధాని మోడీ ఇమేజ్ ను పెంచడానికి మాత్రమే అని ఆరోపించారు. 'మేక్ ఇన్ ఇండియా' అనే హై వోల్టేజ్ ప్రచారం కేవలం తన ప్రతిష్టను పెంచుకోవడానికేనని, దాని వల్ల దేశానికి ఒరిగేదేముందని ప్రశ్నించారు. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ పేరును ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీగా మార్చడంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. బీజేపీ, ఆరెస్సెస్ ల చౌకబారు మనస్తత్వం, నియంతృత్వ ధోరణిగా కేంద్రం చర్యను ఖర్గే అభివర్ణించగా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ ఇది రాజకీయ అజీర్ణానికి క్లాసిక్ ఉదాహరణ అని వ్యాఖ్యానించారు.
