హిందీ మన సాంస్కృతిక ప్రవాహానికి ప్రాణమని, మన సంస్కృతి, చరిత్ర ఆత్మను అర్థం చేసుకోవాలంటే ఆ భాషను నేర్చుకోవాలని అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. స్థానిక భాషల బలోపేతానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
భారత ప్రజలు తమ మాతృభాషను నేర్చుకోవాలని, అర్థం చేసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోరారు. హిందీ దివస్ ను పురస్కరించుకుని జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. హిందీ అన్ని భారతీయ భాషలకు మిత్ర భాష అని, ఇది మొత్తం దేశాన్ని ఒక అధికారిక భాషగా ఐక్యం చేస్తుందని అన్నారు. స్థానిక భాషలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
Heavy rainfall: భారీ వర్షం.. ముంబయి సహా పలు ప్రాంతాలకు ఐఎండీ హెచ్చరికలు
‘‘ స్థానిక భాషలు, హిందీ మన సాంస్కృతిక ప్రవాహానికి ప్రాణం. మన సంస్కృతి, చరిత్ర ఆత్మను అర్థం చేసుకోవాలంటే, మనం అధికారిక భాషను నేర్చుకోవాలి. వీటిని అర్థం చేసుకోవాలంటే మన స్థానిక భాషలను బలోపేతం చేసుకోవాలి. అధికారిక భాష, స్థానిక భాషలు కలిసి బ్రిటిష్ వారు సృష్టించిన భాషల న్యూనతా భావాన్ని కూలదోస్తాయి. అందుకు సమయం ఆసన్నమైంది ’’ అని అమిత్ షా ఈ రోజు గుజరాత్ లో అన్నారు.
బుధవారం సూరత్ లో హిందీ దివస్ సందర్భంగా ఏర్పాటు చేసిన రెండో అఖిల భారత అధికార భాషా సదస్సులో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. హిందీతో పాటు అన్ని స్థానిక భాషల సమాంతర అభివృద్ధికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
పోరాటం లేకుండానే చైనాకు మోడీ 1,000 చదరపు మీటర్లు భూభాగాన్ని ఇచ్చేశారు - రాహుల్ గాంధీ
258 మిలియన్ల మంది ప్రజలు స్థానిక భాషగా మాట్లాడే హిందీ, ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో నాగుగో భాషగా గుర్తించబడింది. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సెప్టెంబర్ 14ను హిందీ దివస్ గా అధికారికంగా ప్రకటించారు. భారత రాజ్యాంగ సభ దేవనాగరి లిపిలో రచించబడిన హిందీని 1949 సెప్టెంబరు 14 న యూనియన్ ఆఫ్ ఇండియా అధికారిక భాషగా ప్రకటించింది. ఇంగ్లీష్ రెండో అధికారిక అధికారిక భాషగా ఉంది.
హిందీ దివాస్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాక్షాంక్షలు తెలిపారు. ‘‘ ప్రపంచవ్యాప్తంగా హిందీ భారతదేశానికి ప్రత్యేక గౌరవాన్ని తెచ్చిపెట్టింది. దాని సరళత, సహజత్వం, సున్నితత్వం ఎప్పుడూ ఆకర్షిస్తాయి. హిందీ దివస్ సందర్భంగా, దానిని సుసంపన్నంగా, శక్తివంతం చేయడంలో అవిశ్రాంతంగా కృషి చేసిన వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని ప్రధాని మోదీ బుధవారం ఉదయం ట్వీట్ చేశారు.
