Asianet News TeluguAsianet News Telugu

భయపడే వ్యక్తి మోడీ కాలేడు - రాయ్ పూర్ విజయ్ సంకల్ప్ ర్యాలీలో ప్రధాని.. కాంగ్రెస్ పై ఫైర్

ప్రధాని నరేంద్ర మోడీ ఛత్తీస్ గఢ్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం రాజధాని రాయ్ పూర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. 

 

Modi can't be a scared man - PM fires on Congress..ISR
Author
First Published Jul 7, 2023, 3:39 PM IST | Last Updated Jul 7, 2023, 3:39 PM IST

ఛత్తీస్ గఢ్ లో పర్యటనలో భాగంగా సుమారు రూ.7,600 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా రాయ్ పూర్ లో ఏర్పాటు చేసిన  విజయ్ సంకల్ప్ ర్యాలీలో  ప్రసంగిస్తూ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. అవినీతిలో కూరుకుపోయిన వారు ప్రతిపక్ష ఐక్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. 

ప్రధానిపై అసభ్య పదజాలం ఉపయోగించినంత మాత్రాన దేశద్రోహం కాదు - కర్ణాటక హైకోర్టు

‘‘నేడు మచ్చ ఉన్న వారంతా ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు ఒకరినొకరు తిట్టుకునే వారు ఇప్పుడు కలిసి రావడానికి సాకులు వెతుక్కోవడం ప్రారంభించారు’’ అని ప్రధాని మోడీ అన్నారు.  కాంగ్రెస్ అవినీతికి గ్యారెంటీ అయితే, అవినీతిపై చర్యలకు ప్రధాని మోడీ గ్యారంటీ అని అన్నారు. ‘ఈ దేశంలోని ప్రతి అవినీతిపరుడు ఒక మాటను చెవులు తెరిచి వినాలి. అవినీతికి కాంగ్రెస్ గ్యారంటీ అయితే, అవినీతిపై చర్యలకు మోడీ గ్యారంటీ’ అని తెలిపారు.

‘‘ వీళ్లు నన్ను అనుసరిస్తారు, నాకు సమాధిని తవ్వుతామని బెదిరిస్తారు, నాపై కుట్రలు చేస్తారు. కానీ వారికి తెలియదు, భయపడే వ్యక్తి మోడీ కాలేడు.’’ అని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అవినీతి రాజ్యమేలుతోందని ఆయన అన్నారు. అవినీతి లేకపోతే కాంగ్రెస్ ఊపిరి పీల్చుకోలేకపోతుందని ఆరోపించారు. అవినీతియే కాంగ్రెస్ అతిపెద్ద సిద్ధాంతమన్నారు.

ఓ సారి క్రిమినల్ ను కాపాడిన డాక్టర్.. గుర్తుంచుకొని మరీ హత్య కుట్రపై అలెర్ట్ చేసిన కాంట్రాక్ట్ కిల్లర్..

ఛత్తీస్ గఢ్ లో అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ను ప్రధాని ఏటీఎంతో పోల్చారు. ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం కార్డులాంటిదని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ఆ పార్టీ అడ్డుగోడలా నిలిచిందని ప్రధాని అన్నారు. ‘‘మీ హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ పంజా ఇది. చత్తీస్ గఢ్ ను దోచుకుని నాశనం చేయాలని ఈ పంజా నిర్ణయించింది.’’ అని అన్నారు. ఛత్తీస్ గడ్ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ ప్రధాన పాత్ర పోషించిందని, ఇక్కడి ప్రజలను బీజేపీ మాత్రమే అర్థం చేసుకుంటుందని అన్నారు. 

క్రమశిక్షణ పేరుతో 15 మంది బాలికల జుట్టు కత్తిరించిన టీచర్.. ఆగ్రహించిన తల్లిదండ్రులు ఏం చేశారంటే ?

బహిరంగ సమావేశానికి వస్తూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన ముగ్గురికి ప్రధాని సంతాపం తెలిపారు. మృతులకు నివాళులర్పిస్తున్నానని, క్షతగాత్రుల చికిత్సకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నామని ప్రధాని హామీ ఇచ్చారు. అంతకుముందు చత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో రూ.7,000 కోట్ల విలువైన ఎనిమిది ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని లబ్ధిదారులకు కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం కార్డుల పంపిణీని కూడా ప్రధాని ప్రారంభించారు. అంతేకాకుండా రాష్ట్రంలోని కంకేర్ జిల్లాలోని అంతగఢ్ నుంచి రాయ్ పూర్ వరకు కొత్త రైలును ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios