Asianet News TeluguAsianet News Telugu

కొలువుదీరిన మోదీ 3.0 సర్కార్... కేంద్ర కేబినెట్‌లో ఐదురుగు తెలుగువారు... ఆరుగురు మహిళలు

Modi 3.0: భారత్ లో మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. వరుసగా మూడోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 72 మంది ఎంపీలు మంత్రులుగా ప్రమాణం చేశారు. కాగా, కేంద్ర కేబినెట్ లో మన తెలుగు వారు ఐదుగురు ఉండటం విశేషం. 

Modi 3.0 Sarkar... There are five Telugu people in the central cabinet
Author
First Published Jun 9, 2024, 10:55 PM IST

దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. వరుసగా మూడోసారి భారత ప్రధాన మంత్రి మోదీతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు 72 మంది ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇందులో 30 మందికి కేంద్ర కేబినెట్ హోదా కల్పించగా... మిగిలిన వారు సహాయ మంత్రులు ఉన్నారు. 72 మందిలో ఐదుగురు స్వతంత్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 

ఈసారి ఐదుగురు తెలుగువారికి కేంద్ర కేబినెట్ పదవులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలు కింజరాపు రామ్మోహన్ (శ్రీకాకుళం), పెమ్మసాని చంద్రశేఖర్ (గుంటూరు), భూపతిరాజు శ్రీనివాస వర్మ (నర్సాపురం), తెలంగాణ నుంచి కిషన్‌ రెడ్డి (సికింద్రాబాద్‌), బండి సంజయ్‌ కుమార్‌ (కరీంనగర్‌) కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

కాగా, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్ పదవులు దక్కగా.. పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, బండి సంజయ్ లకు కేంద్ర సహాయ మంత్రి పదవులు దక్కాయి. 

పార్టీల వారీగా కూర్పు ఇలా...
ఎన్డీయేలో అతిపెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకే కేబినెట్ పదవుల్లో అత్యధికం దక్కాయి. పార్టీల వారీగా దక్కిన మంత్రి పదవులు ఇలా...
బీజేపీ - 56
తెలుగుదేశం పార్టీ - 2 
జనతాదళ్ యునైటెడ్ - 2
శివసేన - 2
ఎల్జేపీ - 1
జేడీఎస్ -1
ఎస్.హెచ్.ఎస్ - 1
ఆర్ఎల్డీ -1
అప్నాదళ్ -1
ఎ.జె.ఎస్.యు - 1

సామాజిక వర్గాల వారీగా కేంద్ర మంత్రులు...

ఓబీసీలు - 27 మంది
ఎస్సీలు - 10 మంది
ఎస్టీలు - ఐదుగురు
మైనార్టీలు - ఐదుగురు 

మహిళలు ఆరుగురు
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios