Asianet News TeluguAsianet News Telugu

ఇండియా టుడే సర్వే: కేంద్రంలో మూడో దఫా మోడీ సర్కార్, ఎన్‌డీఏకు 335 ఎంపీ సీట్లు

దేశంలో మరోసారి కమలం పార్టీ  అధికారాన్ని కైవసం చేసుకొంటుందని  ఇటీవలనే  ప్రధాని మోడీ పార్లమెంట్ ఉభయ సభల్లో ధీమాను వ్యక్తం చేశారు. ఇందుకు అనుగుణంగానే సర్వే ఫలితాలు వచ్చాయి.

Modi 3.0 is Mood of the Nation, survey predicts 335 seats for NDA lns
Author
First Published Feb 9, 2024, 10:34 AM IST | Last Updated Feb 9, 2024, 10:34 AM IST

న్యూఢిల్లీ: దేశంలో మూడో దఫా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని  ఇండియా టుడే సర్వే ఫలితాలు వెల్లడించాయి. దేశ రాజధాని ఢిల్లీలోని  ఏడు లోక్ సభ స్థానాలను  బీజేపీ క్లీన్ స్వీప్ చేయనుందని  ఈ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఢిల్లీలో ఆప్  తీవ్రంగా దెబ్బతింటుందని ఈ ఫలితాలు అంచనా వేశాయి.

దేశంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో 2023 డిసెంబర్ 15 నుండి జనవరి  28 మధ్య సర్వే నిర్వహించారు.  దేశంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో  35,081 మంది ఈ సర్వేలో పాల్గొనట్టుగా ఇండియాటుడే వెల్లడించింది.

also read:పట్నం దంపతులు రేవంత్ తో భేటీ: రంగారెడ్డి రాజకీయాలను మలుపు తిప్పనున్నాయా?

వచ్చే ఎన్నికల్లో  బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ 335 ఎంపీ సీట్లను కైవసం చేసుకొని మూడో దఫా అధికారాన్ని నిలుపుకొనే అవకాశం ఉందని ఈ సర్వే ఫలితాలు తెలుపుతున్నాయి.  కేంద్రంలో  ప్రభుత్వ ఏర్పాటుకు  272 ఎంపీ సీట్లు అవసరం. కనీస మెజారిటీని సునాయాసంగా  గెలుచుకోనుంది.

కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియాక కూటమికి  166 ఎంపీ సీట్లు దక్కుతాయని ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి. 543 ఎంపీ సీట్లలో  బీజేపీ  304 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంటుందని ఈ సర్వే తెలిపింది.2019 ఎన్నికల్లో బీజేపీ  303 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది.  బీజేపీ తర్వాత కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఎంపీ స్థానాల్లో విజయం సాధించనుంది.  2019 ఎన్నికల్లో సాధించిన  స్థానాల్లో కంటే  19 స్థానాల్లో అధికంగా  కాంగ్రెస్ విజయం సాధించనుందని  ఈ సర్వే వెల్లడించింది.  కాంగ్రెస్ పార్టీకి  71 ఎంపీ స్థానాలు దక్కనున్నాయని  ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి. మిగిలిన  168 స్థానాల్లో  ప్రాంతీయ పార్టీలు, ఇండిపెండెంట్లు కైవసం చేసుకుంటాయని ఇండియా టుడే సర్వే తెలిపింది.

also read:కేసీఆర్ కాలం చెల్లిన ఔషదం: రేవంత్ రెడ్డి సెటైర్లు

రామ మందిర నిర్మాణం అంశం మోడీ పీఎంగా ఉన్న సమయంలో అత్యంత ముఖ్యమైన  అంశంగా పరిగణించబడుతుందని  ఈ సర్వేలో పాల్గొన్న వారిలో  42 శాతం మంది అభిప్రాయపడినట్టుగా సర్వే ఫలితాలు వెల్లడించాయి.  అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహా ప్రాణ ప్రతిష్టను  17 శాతం మంది పెద్ద విజయంగా పేర్కొన్నారు.

కరోనాను నివారణలో కేంద్ర ప్రభుత్వ చర్యలు అతి పెద్ద విజయంగా  సర్వేలో పాల్గొన్నవారు  అభిప్రాయపడ్డారు.  20 శాతం మంది మోడీ ప్రభుత్వానికి ఈ విషయంలో క్రెడిట్ ఇచ్చారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios