టెర్రస్‌పై నుంచి దూకడానికి ముందు గుంగున్ తన తండ్రికి phone చేసి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెప్పినట్లు సమాచారం. తనని చూడడానికి వచ్చినప్పుడైనా తన మొహం చూడాలని తండ్రిని కోరినట్టుగా సమాచారం. కూతురు ఫోన్ అందుకున్న వెంటనే గున్‌గన్ తండ్రి గణేష్ ఉపాధ్యాయ్ పోలీసులకు సమాచారం అందించాడు. వారు హుటాహుటిన హోటల్ కు చేరుకున్నారు. అయితే పోలీసులు వచ్చేలోపే గుంగున్ హోటల్ ఆరో అంతస్తు నుంచి దూకేసింది.

రాజస్థాన్‌ : Rajasthan‌లోని జోధ్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. శనివారం రాత్రి ఓ హోటల్ టెర్రస్‌పై నుంచి దూకి ఓ woman ఆత్మహత్యాయత్నం చేసింది. జోధ్‌పూర్ నగరంలో నివసించే గుంగున్ ఉపాధ్యాయ్ అనే మహిళ Fashion model. పనిమీద ఉదయపూర్ వెళ్లిన ఆమె శనివారం జోధ్‌పూర్‌కు తిరిగి వచ్చింది. అదే రోజు రాత్రి ఆమె జోధ్‌పూర్‌లోని రతనాడ ప్రాంతంలోని హోటల్ లార్డ్స్ ఇన్ ఆరో అంతస్తు పై నుంచి దూకి Suicide attempt చేసింది.

టెర్రస్‌పై నుంచి దూకడానికి ముందు గుంగున్ తన తండ్రికి phone చేసి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెప్పినట్లు సమాచారం. తనని చూడడానికి వచ్చినప్పుడైనా తన మొహం చూడాలని తండ్రిని కోరినట్టుగా సమాచారం. కూతురు ఫోన్ అందుకున్న వెంటనే గున్‌గన్ తండ్రి గణేష్ ఉపాధ్యాయ్ పోలీసులకు సమాచారం అందించాడు. వారు హుటాహుటిన హోటల్ కు చేరుకున్నారు. అయితే పోలీసులు వచ్చేలోపే గుంగున్ హోటల్ ఆరో అంతస్తు నుంచి దూకేసింది.

ఇది గమనించిన పోలీసులు... వెంటనే గుంగున్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గుంగున్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆరు అంతస్తులమీదినుంచి పడడంతో ఆమె కాళ్లు, ఛాతీ ప్రాంతాల్లో తీవ్రంగా ఫ్రాక్చర్ అయింది. తీవ్ర రక్త స్రావం అయ్యింది. దీంతో వైద్యులు రక్తాన్ని ఎక్కిస్తున్నారు. 

అయితే గుంగున్ ఇలాంటి పని చేయడానికి పూనుకోకవడం వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదు. గుంగున్ ప్రస్తుతం మాట్లాడే పరిస్థితుల్లో లేదు. ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాతే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్ లోని Bulandshahrలో గత రెండు రోజులుగా కనిపించకుండా పోయిన ఓ డాక్టర్ ఎనిమిదేళ్ల కుమారుడి dead bodyని బులంద్‌షహర్ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి చిన్నారిని kidnap చేసి, murder చేశారనే ఆరోపణలతో డాక్టర్‌ దగ్గర పనిచేసిన ఇద్దరు ఉద్యోగులు నిజాం, షాహిద్‌లను చటారీ పోలీస్ స్టేషన్ పోలీసులు arrest చేశారు. విచారణలో చటారీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో చిన్నారి మృతదేహం ఉన్నట్టుగా తేలడంతో.. గాలింపు చేపట్టి ఆదివారం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు దేబాయి సర్కిల్ ఆఫీసర్ వందనా శర్మ ఆదివారం తెలిపారు. 

శుక్రవారం సాయంత్రం తన కొడుకు కనిపించడం లేదంటూ డాక్టర్ అయిన చిన్నారి తండ్రి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగినట్లు ఆమె తెలిపారు. ప్రాథమిక విచారణలో సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా, డాక్టర్ దగ్గర పనిచేసిన ఇద్దరు మాజీ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, పిల్లవాడి కిడ్నాప్‌ విషయంలో వారి పాత్రల గురించి ప్రశ్నించారని ఆమె చెప్పారు.

గతంలో డాక్టర్‌ దగ్గర కాంపౌండర్‌లుగా పనిచేసిన వీరిద్దరూ.. తమ పనిలో తప్పిదానికి పాల్పడ్డారని రెండేళ్ల క్రితం ఉద్యోగం నుంచి తీసేశారు. దీంతో పగ పెంచుకున్న వీరు.. డాక్టర్‌ మీది శత్రుత్వంతోనే చిన్నారిని కిడ్నాప్ చేసి.. హత్య చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించారు. ఈ మేరకు వందనా శర్మ తెలిపారు. ఆ తరువాత చిన్నారి మృతదేహాన్ని ఎక్కడ పారేసింది చెప్పడంతో... పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారని శర్మ తెలిపారు.