జేబులో పేలిన ఫోను.. (వీడియో)

Mobile blast incident in mumbai restaurant
Highlights

జేబులో పేలిన ఫోను.. (వీడియో)

ఓ వ్యక్తి రెస్టారెంట్లో కూర్చొని భోజనం చేస్తుండగా ఉన్నట్టుండి ఆయన జేబులోని ఫోన్‌ పేలిపోయింది. ఈ  ఘటన ముంబయిలోని భాందప్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటన రెస్టారెంట్లోని సీసీటీవీలో రికార్డైంది. అది సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. భాందప్‌ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లో ఈ నెల 4వ తేదీన ఓ వ్యక్తి లంచ్‌ చేస్తున్నాడు. ఇంతలో పైజేబులో ఉన్న ఫోన్‌ నుంచి పొగలు రావటం ప్రారంభింది. ఆ వ్యక్తి  జేబులోంచి దాన్ని విసిరేసి దూరంగా జరిగాడు. అంతలో అది పేలిపోయింది. ఆ ఘటనతో ఒక్కసారిగా రెస్టారెంట్‌లోని మిగతావారు బయటకు పరుగులు తీశారు. స్వల్ఫ గాయాపాలైన ఆ వ్యక్తి తర్వాత చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాడు. ఈ ఫోన్ ఏ కంపెనీది అన్న వివరాలు తెలియదు.  

loader