ముంబైలోని కుర్లాకు చెందిన ఓ వ్యక్తిని గోమాంసం అక్రమంగా రవాణా చేస్తున్నాడని దుండగులు దాడిచేసి కొట్టి, చంపారు.
ముంబై : మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో గోమాంసాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో గోసంరక్షకుల బృందం శనివారం రాత్రి ఓ వ్యక్తిని కొట్టి చంపింది. బాధితుడు ముంబైలోని కుర్లాకు చెందిన 32 ఏళ్ల అఫాన్ అన్సారీ, అతని సహాయకుడు నాసిర్ షేక్‌తో కలిసి కారులో మాంసాన్ని తరలిస్తుండగా, వారిని గోసంరక్షకులు అడ్డగించి, కొట్టారు.
ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారిద్దరినీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దీని గురించి పోలీసులు మాట్లాడుతూ.. "ఘటన స్థలానికి చేరుకున్నప్పుడు, కారు దెబ్బతిన్న స్థితిలో ఉండడం గమనించాం. గాయపడిన వ్యక్తులు ఇద్దరు కారులో ఉన్నారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చాం. అక్కడ చికిత్స తీసుకుంటూ వారిలో ఒకరు మరణించారు" అని సబ్-ఇన్‌స్పెక్టర్ సునీల్ భామ్రే చెప్పారు.
ఆహారంలో మత్తుమందు కలిపి ఐదుగురు కుటుంబసభ్యుల హత్య.. ఆ తరువాత కాల్చుకుని ఆత్మహత్య..
ఈ కేసులో ఇప్పటి వరకు పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వ్యక్తి ఫిర్యాదు మేరకు హత్య, అల్లర్లు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.ల్యాబ్ రిపోర్టు వచ్చిన తర్వాతే వారు గోమాంసం రవాణా చేస్తున్నారా లేదా అనేది తేలనుంది.
గోవధ నిషేధ చట్టం చెల్లుబాటును బాంబే హైకోర్టు సమర్థించిన ఎనిమిదేళ్ల తర్వాత, గోవుల వధను నిషేధించే చట్టాన్ని అమలు చేయడానికి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనను మహారాష్ట్ర ప్రభుత్వం మార్చిలో ముందుగా ఆమోదించింది. ఆవు, లేదా ఎద్దును ఎగుమతి చేయడానికి ఉపయోగించే ఏదైనా వాహనాన్ని సంబంధిత అధికారి ఆపి, పరిశీలించవచ్చని, ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది. వధ కోసం రవాణా చేయడంపై నిషేధాన్ని కూడా కోర్టు సమర్థించింది.
