ఓ వ్యక్తి తన కుటుంబంలోని ఐదుగురిని దారుణంగా హత్య చేశాడు. ఆ తరువాత తానూ కాల్చుకుని చనిపోయాడు. చంపేముందు వారికి ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చాడు.
ఆగ్రా : నోయిడాలోని కంప్యూటర్ సెంటర్‌లో పనిచేస్తున్న 28 ఏళ్ల వ్యక్తి తన కుటుంబంలోని ఐదుగురిపై గొడ్డలితో దాడిచేసి హతమార్చి, ఆపై తనను తాను కాల్చుకుని చనిపోయాడు. యుపిలోని మెయిన్‌పురి జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. ఇది జరిగిన ఒక రోజు తర్వాత, దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుల్లో ఒకరు మాట్లాడుతూ.. "హంతకుడు, శివ వీర్ యాదవ్, గొడ్డలితో దాడి చేయడానికి ముందు కుటుంబ సభ్యులకు మత్తుమందు కలిపిన ఆహారం,పానీయాలు అందించాడు" అని తెలిపారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న హంతకుడి అత్త సుష్మా దేవి (35) మాట్లాడుతూ, "అర్ధరాత్రి 12 గంటల సమయంలో, శివ మొదట అతని కుటుంబ సభ్యులకు మత్తుమందు ఇచ్చి, ఆపై అతని 24 ఏళ్ల భార్య డాలీతో సహా మిగతా వారిపై దాడి చేశాడు. నేను అతనిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు, అతను నాపై కూడా దాడి చేసాడు. కానీ ఎలాగోలా నేను తప్పించుకోగలిగాను. తర్వాత ఇంటి బయటకి వెళ్లి కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నేరం చేయడానికి ముందు తన పిల్లలిద్దరినీ.. నాలుగేళ్ల కూతురు, మూడు నెలల కొడుకుని పక్కింట్లోకి విసిరేశాడు..’’ అని చెప్పింది.
ఫ్యామిలీతో హాలిడేకు వెళ్తుండగా ఊహించని ప్రమాదం.. రైల్వే స్టేషన్ వద్ద కరెంట్ షాక్‌తో టీచర్ మృతి..
మృతులను కొత్తగా పెళ్లైన నిందితుడి సోదరుడు సోను యాదవ్, అతని భార్య సోని (20), మరో సోదరుడు భుల్లన్ యాదవ్ (25), బావ సౌరభ్ యాదవ్ (23), స్నేహితుడు దీపక్ కుమార్ (20)గా గుర్తించారు. అందరూ కిషన్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోకుల్‌పురా అర్సరా గ్రామ నివాసితులు.
బంధువుల ప్రకారం, నిందితుడు తన తమ్ముడి వివాహ వేడుకకు హాజరయ్యేందుకు 20 రోజుల క్రితం ఇంటికి తిరిగి వచ్చాడు, అయితే అతను "పెళ్లికి రెడీ అవుతున్నప్పుడు సంతోషంగా కనిపించలేదు" అన తెలిపారు. అంతేకాదుశివ వీర్ వారం రోజుల క్రితమే హత్యలకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే హత్యకు ఆయుధాన్ని కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు భారీగా అప్పులు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఎస్‌హెచ్‌వో అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. బాధితుల విస్కారా నివేదిక రావాల్సి ఉందని, ఐపీసీ సెక్షన్ 302(హత్య), 307(హత్యాయత్నం) కింద కేసు నమోదు చేశామని, సామూహిక హత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నామని’’ ఎస్‌హెచ్‌వో అనిల్‌కుమార్ తెలిపారు.
