డబ్బులున్నవాళ్లే థియేటర్‌కు రావాలన్నాడు.. చితకబాదిన జనాలు

mns worders slap multiplex manager at Pune
Highlights

డబ్బులున్నవాళ్లే థియేటర్‌కు రావాలన్నాడు.. చితకబాదిన జనాలు

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు పెద్దలు.. ఆ నోరు అదుపులో పెట్టుకోలేక ఆగ్రహంలో ఉన్నవారిని మరింత రెచ్చగొట్టి తన్నులు తిన్నాడు ఓ పెద్దమనిషి.. వివరాల్లోకి వెళితే.. పుణే నగరంలోని మల్టీఫ్లెక్స్‌లో ఆహార పదార్థాలను అధిక రేట్లకు విక్రయిస్తున్నారంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన కార్యకర్తలు వివిధ థియేటర్లను పరిశీలిస్తున్నారు.. దీనిలో భాగంగా సేనాపతిరోడ్‌‌లో ఉన్న పీవీఆర్ ఐకాన్ మల్టీఫ్లెక్స్‌కు వచ్చారు.

ఇదే సమయంలో ధరల గురించి ఆరా తీయగా.. ఎంఆర్పీ కంట ఎక్కువ రేట్లకు తినుబండారాలను విక్రయిస్తున్నట్లు తేలింది. థియేటర్ అసిస్టెంట్ మేనేజర్‌ను దీనిపై ప్రశ్నించగా.. ‘డబ్బులు ఉన్నవాళ్లే థియేటర్‌కు రావాలని.. భరించలేని వాళ్లు థియేటర్‌కు రావొద్దని అన్నాడు’ దీంతో కార్యకర్తలకు చిర్రేత్తుకొచ్చింది. ఆగ్రహాం పట్టలేక వెంటనే అతనిపై చేయిచేసుకున్నారు.

ఈ తతంగాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అవుతోంది.. దీనిపై నవనిర్మాణ్ సేన కార్యకర్తలను ప్రశ్నించగా.. అధిక రేట్లకు ఆహార పదార్థాలను అమ్ముతున్నారని.. అన్ని థియేటర్లకు వెళ్లినట్లుగానే ఇక్కడికి కూడా వచ్చామని.. అసిస్టెంట్ మేనేజర్‌ వైఖరి సరిగా లేకపోవడంతో చేయిచేసుకున్నామని అంగీకరించారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

loader