Aizawl: మిజోరంలోని కురుంగ్ నదిపై నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి బుధవారం కుప్పకూలింది. ఈ ప్రమాదం కారణంగా స్పాట్ లోనే 18 మంది కార్మికులు మృతి చెందారు. పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఐజ్వాల్ కు 21 కిలోమీటర్ల దూరంలోని సైరంగ్ లో ఉదయం 9.30 గంటలకు ఈ ఘటన జరిగింది. బ్రిడ్జి కూలిన సమయంలో మొత్తం 28 మందికి పైగా కార్మికులు అక్కడే ఉన్నట్లు సమాచారం.
Railway Bridge Collapses: Aizawl: మిజోరంలోని కురుంగ్ నదిపై నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి బుధవారం కుప్పకూలింది. ఈ ప్రమాదం కారణంగా స్పాట్ లోనే 18 మంది కార్మికులు మృతి చెందారు. పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఐజ్వాల్ కు 21 కిలోమీటర్ల దూరంలోని సైరంగ్ లో ఉదయం 9.30 గంటలకు ఈ ఘటన జరిగింది. బ్రిడ్జి కూలిన సమయంలో మొత్తం 28 మందికి పైగా కార్మికులు అక్కడే ఉన్నట్లు సమాచారం. సైరంగ్ జీరో పాయింట్ సమీపంలో నిర్మాణంలో ఉన్న 196వ నెంబర్ రైల్వే బ్రిడ్జి కూలిపోయింది. 18 మంది మృతదేహాలను వెలికితీశామనీ, గాయపడిన ముగ్గురిని రక్షించామని మిజోరం ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 22కు పెరిగిందని సంబంధిత అధికారులు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. మిజోరంలో నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 22కు చేరింది. శిథిలాల నుంచి ఇప్పటివరకు 22 మృతదేహాలను వెలికితీశామని రైల్వే, పోలీసులు తెలిపారు. స్టీల్ బ్రిడ్జి శిథిలాల కింద చిక్కుకున్న నలుగురి మృతదేహాలను వెలికితీసే పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర రాజధాని ఐజ్వాల్ కు 21 కిలోమీటర్ల దూరంలోని సైరంగ్ వద్ద నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి బుధవారం ఉదయం 11 గంటల సమయంలో కూలింది. ఈశాన్య రాష్ట్రాల రాజధానులను కలిపే రైల్వే ప్రాజెక్టు ప్రకారం నిర్మిస్తున్న 130 ఫ్లైఓవర్లలో ఒకటైన భైరవి, సైరంగ్ మధ్య నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంపై రైల్వే యంత్రాంగం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిజోరం వంతెన ప్రమాదం చాలా ఆందోళన కలిగించే విషయమన్నారు. ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మిజోరం గవర్నర్ హరిబాబు కంపాటి, రాష్ట్ర ముఖ్యమంత్రితో ఫోన్ లో మాట్లాడి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి జోరంథాంగా తన ఎక్స్ పేజీలో.. "ఐజ్వాల్ సమీపంలోని సైరంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వంతెన ఈ రోజు కూలిపోయింది. దాదాపు 15 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విషాదం గురించి తెలిసి చాలా బాధపడ్డాను. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు ట్వీట్ చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పెద్ద సంఖ్యలో వచ్చి సహాయక చర్యల్లో సహకరించిన ప్రజలకు తన ప్రేమను తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఈశాన్య రైల్వే ప్రధాన అధికార ప్రతినిధి సబ్యసాచి డే తెలిపారు. నార్త్ జోన్ ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలాన్ని సందర్శించనున్నారు. ప్రమాదం జరిగిన వంతెనను బైరాబీ, సైరంగ్ రైల్వే స్టేషన్ల మధ్య గురుంగ్ నదిపై నిర్మిస్తున్నారు. ఈ వంతెన ఒక పిల్లర్ ఎత్తు 104 మీటర్లు మాత్రమే. మిజోరం రాజధాని ఐజ్వాల్ కు చేరుకునే ముందు సైరోంగ్ ను చివరి స్టేషన్ గా మార్చడానికి ఈ వంతెనను నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత ఐజ్వాల్ ను జాతీయ రైల్వే లైన్లతో అనుసంధానం చేయనున్నారు.
