తమ మంత్రులకు హిందీ రాదని, ఇంగ్లీష్ భాషపైనా పట్టు లేదని, కాబట్టి, మిజోరం రాష్ట్రానికి మిజో భాష సరిగ్గా రాని ఓ అధికారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం సరికాదని ముఖ్యమంత్రి జోరంతంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. మిజో భాష రాకుండా సీఎం ప్రభావవంతంగా విధులు కొనసాగించలేరని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒకరిని సీఎస్‌గా నియమిస్తే రాష్ట్ర ప్రభుత్వం మరొకరని నియమించింది.
cన్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై Mizoram ముఖ్యమంత్రి జోరమ్‌తంగా అసంతృప్తితో ఉన్నారు. అందుకే తాజాగా, కేంద్ర హోం శాఖ మంత్రి Amit Shahకు ఓ లేఖ రాశారు. తమ మంత్రులకు హిందీ రాదని, కొందరికీ ఇంగ్లీష్ అర్థం చేసుకోవడమూ కష్టమేనని పేర్కొన్నారు. అందుకే Mizo భాష అర్థం కాని అధికారిని మిజోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించే ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను సవరించాలని సూచించారు. అంతేకాదు, మిజోరం అదనపు ప్రధాన కార్యదర్శి జేసీ రామ్‌తంగాను Chief Secretaryగా నియమించాలనీ విజ్ఞప్తి చేశారు.
‘మిజోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పని చేసిన గుజరాత్ క్యాడర్ అధికారి లల్నున్మావియా చువాగో పదవీ విమరణ చెందడంతో.. ఆయన స్థానాన్ని అదనపు ప్రధాన కార్యదర్శి జేసీ రామ్‌తంగా (మణిపూర్ క్యాడర్)ను నియమించాలని ఇది వరకు మేము విజ్ఞప్తి చేశాము. కానీ, కేంద్ర హోం శాఖ మా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకుండా రేణు శర్మను మిజోరం నూతన ప్రధాన కార్యదర్శిగా నియమించింది’ అని పేర్కొన్నారు.
Also Read: Assam- Mizoram Riots : అసోం ముఖ్యమంత్రిపై ఎఫ్ఐఆర్ దాఖలు
ఈ నెల 1వ తేదీ నుంచి రేణు శర్మ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు. కాగా, అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రధాన కార్యదర్శిగా జేసీ రామ్‌తంగాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పుడు మిజోరం రాష్ట్రానికి ఇద్దరు ప్రధాన కార్యదర్శులున్నారు.
‘మిజో ప్రజలు చాలా మందికి హిందీ భాష రాదు. మా క్యాబినెట్ మంత్రులకూ హిందీ అర్థం కాదు. కొందరికి ఇంగ్లీష్ భాషతోనూ సమస్యే ఉన్నది. ఈ నేపథ్యంలో మిజో భాషపై పట్టులేని అధికారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తే వారు ప్రభావవంతంగా విధులు నిర్వహించలేరు. ఈ కారణంగానే ఇప్పటి వరకు కేంద్రంలో యూపీఏ ఉన్నా.. ఎన్‌డీఏ ఉన్నా... మిజోరం రాష్ట్రానికి మిజో భాష వచ్చినవారినే సీఎంగా నియమించారు. మిజోరం రాష్ట్ర ఏర్పడినప్పటి నుంచి ఇదే ఆనవాయితీగా వస్తున్నది. కేవలం మిజోరం రాష్ట్రానికే కాదు.. భారత్‌లోని ఏ రాష్ట్రాన్ని తీసుకునే ఇదే పద్ధతి కొనసాగుతున్నది’ అని వివరించారు.
Also Read: అమిత్ షా కు వెంకయ్య షాక్: ఏ ఒక్క భాషనో ఇతరులపై రుద్దొద్దంటూ ప్రకటన
తాను ఎన్‌డీఏ ప్రభుత్వంతో విశ్వాసంతో నడుచుకుంటున్నారని, ఈశాన్య రాష్ట్రాలన్నింటి కెల్లా తానే ఎన్‌డీఏతో నమ్మకంతో వ్యవహరిస్తున్నానని తెలిపారు. అందుకే తన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నట్టు వివరించారు. తన కంటే ముందు కాంగ్రెస్ ముఖ్య మంత్రిగా వ్యవహరించినప్పుడూ మిజో భాష తెలిసిన అధికారినే ప్రధాన కార్యదర్శిగా నియమించారని గుర్తు చేశారు. ఇప్పుడు తన విజ్ఞప్తిని కేంద్ర హోం శాఖ తిరస్కరిస్తే.. కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలన్నీ ఎన్‌డీఏతో సన్నిహితంగా కొనసాగుతున్న తనను అవహేళన చేస్తారని పేర్కొన్నారు. కాబట్టి.. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను వెంటనే సవరించాలని కోరారు.
