Pulwama encounter: దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మిలిటెంట్లు ఉన్నారనే వార్తల మధ్య పోలీసులు, ఆర్మీ సంయుక్త బృందం ఆ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్ర‌మంలో ఎన్‌కౌంటర్ జరిగింది. 

Pulwama Encounter: దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా పహూ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మిలిటెంట్లు ఉన్నారనే సమాచారం రావ‌డంతో పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా ఆ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్ర‌మంలో ఎన్‌కౌంటర్ జరిగింది. బలగాలు అనుమానాస్పద ప్రాంతాల్లో సోదాలు నిర్వ‌హించ‌డంతో దాక్కున్న ఉగ్రవాదులు భ‌ద్ర‌త బలాగాల‌పై కాల్పులు జరిపారని, దీంతో అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌త బ‌లగాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయ‌ని అధికారులు తెలిపారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన‌ ముగ్గురు ఎల్‌ఇటి ఉగ్రవాదులను లెటి టాప్ కమాండర్ బాసిత్ డిప్యూటీ ఆరిఫ్ అహ్మద్ హజార్, అబూ హుజైఫా, నతీష్ వానీలుగా గుర్తించారు. పోలీసుల‌ రికార్డుల ప్రకారం..ఈ ముగ్గురూ నిందితులు అనేక కేసులున్నాయి. వీరి అనేక సార్లు ఉగ్ర దాడుల్లో పాల్గొన్న‌ట్టు ఆధారాలు ఉన్నాయి. ఎన్‌కౌంటర్ స్థలం భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన పదార్థాలన్నీ తదుపరి విచారణ కోసం.. రికార్డు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు.ఈ మేరకు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

ఈ ఎన్ కౌంట‌ర్ పై కాశ్మీర్ ఐజిపి మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆపరేషన్‌ను భారీ విజయంగా అభివర్ణించారు. ఎటువంటి ప్రాణ‌హని లేకుండా.. ప్రొఫెషనల్ పద్ధతిలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ను నిర్వహించినందుకు భద్ర‌తా బ‌ల‌గాల‌ను అభినందించారు. 

అంతకుముందు.. పుల్వామాలోని పహూ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నార‌నే నిర్దిష్ట స‌మాచారం మేర‌కు పోలీసులు, సైన్యం (50RR) సంయుక్త కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఆపరేషన్ సమయంలో.. సెర్చ్ లో అనుమానాస్పద ప్రదేశం వైపు వెళుతుండగా.. ఉగ్రవాదులు సెర్చ్ పార్టీపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు, అప్ర‌మ‌త్త‌మైన బ‌లగాలు ఈ కాల్పుల‌ను సమర్థవంతంగా 
ఎదుర్కొన్నారు. ఇది ఎన్‌కౌంటర్‌కు దారితీసింది. ఆ తర్వాత సీఆర్పీఎఫ్ కూడా ఆపరేషన్‌లో పాల్గొంది.

హతమైన మిలిటెంట్లలో ఒకరైన ఆరిఫ్ హజార్.. మార్చి 2021 నుండి క్రియాశీలంగా ఉన్నాడు. అతనిపై శ్రీనగర్ నగరంలో అనేక కేసులు నమోదయ్యాయి. పోలీసు అధికారు ప్ర‌కారం.. పౌరుల హత్యల పరంపరలో పాల్గొన్నాడు. అతను జూన్ 22, 2021న మెంగన్‌వారి నౌగామ్‌లోని మసీదు ముందు ఇన్‌స్పెక్టర్ పర్వేజ్‌ను చంపాడు.

సఫాకడల్ వద్ద పోలీసుల పెట్రోలింగ్ పార్టీపై, రైనావారి వద్ద జాయింట్ నాకా పార్టీపై గ్రెనేడ్ దాడుల్లో కూడా ఆరిఫ్ హజార్ పాల్గొన్నాడు. అంతేకాకుండా.. నౌగామ్ శ్రీనగర్‌లోని ఆరీబాగ్‌లో బీజేపీ నాయకుడి నివాసంపై దాడిలో ఆరిఫ్ హజార్ తన సహచరులతో కలిసి దాడిలో పాల్గొన్నాడు. ఈ ఉగ్రదాడిలో రమీజ్ రాజా అనే పోలీసు సిబ్బంది మరణించడంతో పాటు అతని సర్వీస్ రైఫిల్ కూడా లాక్కున్నారు.