ఓ జర్నలిస్ట్ ని అతని ప్రియురాలే అతి దారుణంగా హత్య చేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కాన్పూర్ కి చెందిన అషూయాదవ్ జర్నలిస్ట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా.. అతను ఇటీవల దారుణ హత్యకు గురవ్వగా.. అతని డెత్ మిస్టరీని పోలీసులు చేధించారు. అతనిని ప్రియురాలే చంపినట్లు దర్యాప్తులో తేలింది. కాగా.. అతని ప్రియురాలు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు గుర్తించారు. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కాన్పూర్‌కు చెందిన అషు యాదవ్ కొంతకాలం క్రితమే జర్నలిస్టు వృత్తిలో చేరారు. అయితే అషు యాదవ్ కనిపించడం లేదంటూ అతని కుటుంబ సభ్యులు జనవరి ఒకటిన పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

జనవరి 2న సీటీఐ చెరువు సమీపంలో ఒక కారు అనుమానాస్పద స్థితిలో ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కారును తనిఖీ చేయగా, వెనుక సీటులో ఒక యువకుని మృతదేహం కనిపించింది. పోలీసుల దర్యాప్తులో అది అషుయాదవ్ మృతదేహమని వెల్లడైంది. దీంతో పోలీసుల దర్యాప్తు మరింత వేగవంతమైంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కాన్పూర్ ఎస్పీ రాజ్ కుమార్ తెలియజేస్తూ అషుయాదవ్‌ను అతని ప్రియురాలే హత్య చేయించిందని తెలిపారు. 

ఆమెకు అంతకుముందే అమిత్ అనే యువకునితో ఆమెకు పరిచయం ఉంది. అయితే అషు ఆమె వెనకాలే తిరుగుతున్నాడు. దీంతో ఆమె అమిత్‌తో కలసి అషును హత్య  చేసేందుకు పథకం పన్నిందన్నారు. జనవరి ఒకటవ తేదీ రాత్రి ఆమె ఫోను చేసి, అషును పిలిపించింది. అతను అక్కడికి రాగానే మద్యం తాగించింది. అతను మత్తులో మునిగిపోగానే అమిత్ సాయంతో అషు గొంతునొక్కి హత్య చేసింది. ఈ కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న అషు ప్రేయసి కోసం పోలీసులు వెదుకున్నారు.