మాజీ ప్రపంచసుందరి ప్రియాంక చోప్రా మీద మాజీ సుందరి లీలానీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె పెద్ద అందగత్తె కాదని.. ప్రపంచసుందరి కిరీటాన్ని రిగ్గింగ్ చేసి దక్కించుకున్నారన్నారు.
ముంబై : మిస్ వరల్డ్ 2000 అందాల పోటీలో ప్రపంచ సుందరి కిరీటాన్ని సాధించిన ప్రియాంక చోప్రా మీద మాజీ మిస్ బార్బడోస్ లీలానీ మెక్‌కాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రియాంక చోప్రాకు అనుకూలంగా ఈవెంట్ రిగ్గింగ్ జరిగిందని పేర్కొంది. అలా 18 ఏళ్ల చోప్రా రిగ్గింగ్ తో ప్రపంచసుందరి కిరీటాన్ని సొంతం చేసుకుందని దుయ్యబట్టారు. ఆనాటి ప్రపంచసుందరి పోటీల గురించి వివరిస్తూ లీలానీ ఓ వీడియో షేర్ చేసింది.
యునైటెడ్ కింగ్‌డమ్, లండన్‌లోని మిలీనియం డోమ్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2000 పోటీలో ప్రియాంక చోప్రా విజేతగా నిలిచారు. మిస్ యూఎస్ఏ 2022కి సంబంధించి వివాదాలు తలెత్తిన తర్వాత లీలానీ 22యేళ్ల క్రితంనాటి ఈ పోటీ గురించి మాట్లాడారు. మిస్ టెక్సాస్ యూఎస్ఏ ఆర్ బొన్నై గాబ్రియేల్ టైటిల్‌ను గెలుచుకున్నారు. అయితే దీనిమీద మిస్ మోంటానా యూఎస్ఏ హీథర్ లీ ఓ'కీఫ్, మిస్ జార్జియా యూఎస్ఏ హోలీ హేన్స్ లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పోటీలు గాబ్రియేల్ కు అనుకూలంగా జరిగినట్లు ఆరోపించారు. గాబ్రియేల్ ఈ వాదనలను ఖండించారు. ఈ సందర్భంగా మెక్‌కాన్నే యూట్యూబ్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. దీంట్లో ఆమె "మిస్ వరల్డ్ పోటీల్లో కూడా అక్షరాలా ఇదే జరిగింది" అని పేర్కొంది.
బీజేపీ ఎమ్మెల్యే సోదరుడి కొడుకు అనుమానాస్పద మృతి.. కాలువలో కారులో దొరికిన మృతదేహం..
ఆమె ఈ వీడియోలో మాట్లాడుతూ.. ‘మిస్ బార్బడోస్ గా నేను రెండువేల సంవత్సరంలో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్నాను. ఆ యేడు మిస్ ఇండియా ప్రియాంక చోప్రా ప్రపంచ సుందర కిరీటాన్ని సొంతం చేసుకుంది. 1999,2000.. సంవత్సరాల్లో వరుసగా రెండు సార్లు ప్రపంచ సుందరి కిరీటం భారత్ కే దక్కడానికి స్పాన్సర్లే కారణం. ఎందుకంటే ఆ సంస్థలు ఇండియాకు చెందినవి. ప్రియాంక పెద్ద అందగత్తె కాదు, రిహార్సల్స్ లోనూ పాల్గొనలేదు.. మధ్యాహ్నం పూట లంచ్ కూడా ఆమె రూంకే వెళ్లేది. ఆమె అక్రమంగా కిరీటాన్ని దక్కించుకుంది.
కానీ మిగిలిన వాళ్లందరికీ.. అలాకాదు. ఆమెకు ప్రత్యేకంగా దుస్తులు డిజైన్ చేశారు. బీచ్ లోనూ ఆమెకు స్పెషల్ ఫోటోలు తీసి పేపర్లలో వచ్చేలా చేశారు. మిగిలిన వాళ్లందరినీ గుంపుగా తీశారు. అలా అడుగడుగున్నా ఆ యేడాది మిస్ వరల్డ్ పోటీల్లో ఫేవరేటిజం ప్రదర్శించారు’ అని ఆరోపించారు.
అంతకుముందు సంవత్సరం యుక్తాముఖి మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంది అని ఈ సందర్బంగా గుర్తు చేశారామె. ఇంకా ప్రియాంకా చోప్రా స్కిన్ టోన్ మీద కూడా ఆమె కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్స్ పెద్దగా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదని కొంతమంది అంటున్నారు. మిస్ వరల్డ్ టైటిల్ పేరుతో ప్రియాంక బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ స్టార్ గా ఎదిగింది. అనేక హాలీవుడ్ ప్రాజెక్ట్స్ లోనూ విజయవంతంగా దూసుకుపోతోంది.
కాగా, లీలానీ మెక్‌కాన్ అసంతృప్తి వెనుక తన కెరీర్ లో అంత పెద్ద విజయాలన్ని అందుకోలేకపోవడమే కారణం అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
