బీజేపీ ఎమ్మెల్యే సోదరుడి కొడుకు అనుమానాస్పద మృతి.. కాలువలో కారులో దొరికిన మృతదేహం..
ఐదు రోజుల క్రితం కనిపించకుండాపోయిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు విగతజీవిగా లభించాడు. తుంగా కాలువలో కారులో అతని మృతదేహం లభించడంతో సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
బెంగళూరు : దావణగెరె జిల్లా హోన్నాళి నియోజకవర్గ ఎమ్మెల్యే రేణుకాచార్య సోదరుడి కుమారుడు చంద్రశేఖర్ (24) అదృశ్యమైన ఘటన గురువారం విషాదాంతం అయ్యింది. చంద్రశేఖర్ కారు తుంగా ప్రధాన కాలువలో లభ్యమయ్యింది. అందులో చంద్రశేఖర్ మృతదేహం బయటకు తీశారు. ఐదు రోజుల క్రితం అదృశ్యమైన అతని కోసం పోలీసులు విస్తృతంగా గాలించారు.
దావణగెరె జిల్లా హొన్నాళి తాలూకా కడదగట్టి గ్రామం తుంగా కాలువ వద్ద చంద్రశేఖర్ కారు సంచరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కాలువ దగ్గరకు చేరుకున్న పోలీసులు కారుతలో పాటు అందులో ఉన్న చంద్రశేఖర్ మృతదేహాన్ని బయటకు తీశారు. అది చూసి అక్కడే ఘటనాస్థలంలో ఉన్న ఎమ్మెల్యే రేణుకాచార్య తీవ్రంగా రోదించారు. సోదరుడి కుమారుడు అదృశ్యమై ఐదు రోజులు గడిచినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. చంద్రశేఖర్ కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. చంద్రశేఖర్ మొబైల్ కూడా స్విచ్ఛాఫ్ వచ్చింది.
షాకింగ్.. 21 రోజుల శిశువు కడుపులో 8 పిండాలు.. కణితి అనుకుంటే...
చంద్రశేఖర్ మృతి కేసులో ట్విస్ట్...
ఈ సంఘటన మీద తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కారులో ఇద్దరు ఉన్నట్లు సీసీ కెమెరాలో రికార్డయ్యింది. న్యామతి వద్ద చంద్రశేఖర్ కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్న దృశ్యాలు రికార్డు అయ్యింది. చంద్రశేఖర్ పక్కన మరొకరు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. అదే కారులో చంద్రశేఖర్ మృతదేహం లభ్యమయ్యింది. దీంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హొన్నాళి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉణ్న తుంగా కాలువలో చంద్రశేఖర్ మృతదేహం లభించింది. ఇది హత్య, ఆత్మహత్య అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.