ఐఓబీలో దోపిడి: రూ.45 లక్షల దోచుకొన్న దుండగులు

Miscreants loot 45 lakh at gunpoint from bank in Rourkela
Highlights

ఒడిశాలో బ్యాంకు దోపిడి


రూర్కెలా: ఒడిశా రాష్ట్రంలో  మంగళవారం నాడు ముసుగులు ధరించిన  దుండగులు ఐబీబీ బ్యాంకులో రూ.45 లక్షలను దోచుకెళ్ళారు.  ముసుగులు ధరించిన దుండగులు  బ్యాంకులో  సిబ్బందిని తుపాకీతో బెదిరించి  నగదును దోచుకెళ్ళారు.

హెల్మెట్లు, మాస్కులు ధరించిన ఏడెనిమిది మంది దుండగులు   రూర్కెలాలోని ఐఓబీ బజార్ బ్రాంచ్‌లోకి వెళ్ళారు. సిబ్బందిని తుపాకీలతో బెదిరించి బ్యాంకులోని రూ.45 లక్షలను దోచుకెళ్ళారు.  ఎనిమిది మంది దుండగులు  పట్టణంలోని ఇండియన్ బ్యాంకు బ్రాంచ్‌లోకి చొరబడి సిబ్బందిని బెదిరించి నగదును దోచుకెళ్ళినట్టు పోలీసులు తెలిపారు.

విషయం తెలిసిన వెంటనే రూర్కెలా ఎస్పీ, డీఐజీలు  హుటాహుటిన బ్యాంకుకు చేరుకొని  సంఘటన స్థలానికి   చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. దోపిడి ముఠాను పట్టుకొనేందుకు  పోలీసులు గాలింపు  చర్యలు చేపట్టారు.  పట్టణంలోని దారులన్నీమూసివేసి చెక్ చేస్తున్నారు. పొరుగు రాష్ట్రం జార్ఖండ్‌ నుంచి దోపిడీ ముఠా ఈ లూటీకి తెగబడిందని అనుమానిస్తున్నారు. 
 

loader