పెట్రోల్ లో నీళ్లు... బంక్ బంద్

Mira Road petrol pump water mixed fuel sparks anger
Highlights

ఒక బాటిల్‌లో పెట్రోల్‌ పోయించుకుని చెక్ చేయగా అందులో నీరు ఉన్నట్లు  తేలింది. పలువురు బాధితులు బంకు వద్దకు నిరసన తెలిపారు.

ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల మోతను వినియోగదారులను మోయలేకపోతున్నారు. అలాంటి సమయంలో పెట్రోల్ లో కల్తీ చేస్తే వినియోగదారుల ఫీలింగ్ ఎలా ఉంటుంది. మండిపోతుంది కదా. ఇదే జరిగింది ఒడిశాలో. అంతే.. దెబ్బకి పెట్రోల్ బంక్ ని మూయించేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...మహారాణిపేటకు చెందిన కె.కోటేశ్వరరావు  ఆ బంకులో రూ. 200 పెట్రోల్ స్కూటీలో పోయించుకుని వెళ్లాడు. కొంతదూరం వెళ్లేసరికి వాహనం ముందుకు కదలక మొరాయించింది. ఎంత ప్రయత్నించినా బండి కదలేదు. దీంతో మెకానిక్ దగ్గరకు తీసుకెళ్లాడు. స్కూటీని పరీక్షించిన మెకానిక్ పెట్రోల్ ట్యాంక్‌లో నీరు ఉందని అందుకే స్కూటీ కదలేదని తెలిపాడు. దీంతో బాధితుడు బంకు వద్దకు వెళ్లి మీరు పోసింది పెట్రోలా నీళ్లా అని నిలదీశాడు.

అతని మాటలు విన్న బంకులోని వినియోగదారులకు కూడా అనుమానం వచ్చింది. ఒక బాటిల్‌లో పెట్రోల్‌ పోయించుకుని చెక్ చేయగా అందులో నీరు ఉన్నట్లు  తేలింది. పలువురు బాధితులు బంకు వద్దకు నిరసన తెలిపారు. దీంతో పౌరసరఫరాల అధికారులు హుటాహుటిని అక్కడికి చేరుకుని పెట్రోల్‌ను పరీక్షించారు. పెట్రోల్‌లో నీరు కలిసి ఉందని తేలడంతో బంకునే మూసేశారు. కాగా, పెట్రల్లోక నీరెలా వచ్చిందో తెలియదని, భూమిలోపల ఏమైనా జరిగి ఉండొచ్చని విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.

loader