పద్నాలుగేళ్ల బాలికపై సవతి తండ్రి అత్యాచారం, గర్భందాల్చిన చిన్నారి

Minor raped by stepfather for over 5 months in Madhya Pradesh, gets pregnant
Highlights

తండ్రి చనిపోవడంతో తల్లి రెండో పెళ్ళి చేసుకుంది. అయితే మారు తండ్రిని కూడా ఆ యువతి తన సొంత తండ్రిలాగే భావించింది. కానీ అతడు మాత్రం బాలికపై కన్నేశాడు. వావివరసలు మరిచి కూతురులా చూసుకోవాల్సిన బాలికను బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే చిన్నారి గర్భం దాల్చడంతో ఈ విషయం బైటపడింది. 
 
మధ్యప్రదేశ్ లోని దెవాస్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బాధిత బాలిక ఆరోగ్యం ఈ మధ్య బాగాలేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా గర్భం దాల్చినట్లు డాక్టర్లు తెలిపారు. దీని గురించి బాలికను ప్రశ్నించగా...తన తండ్రి చనిపోవడంతో తల్లి విజయ్ బైరాగి అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుందని, అతడే తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపింది. సవతి తండ్రి గత ఐదు నెలలుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని వెల్లడించింది. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి పలుమార్లు  అత్యాచారం చేశాడని బాలిక తెలిపింది.

అంతే కాదు ఈ అఘాయిత్యం గురించి తల్లికి తెలిపినప్పటికి ఆమె పట్టించుకోలేదని బాలిక ఆవేధన వ్యక్తం చేసింది. దీంతో అతడు మరింత రెచ్చిపోయి దారుణంగా  వ్యవహరించేవాడని పోలీసులకు వివరించింది. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం,  376 ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.   

loader