Asianet News TeluguAsianet News Telugu

ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టుకుంటానని ఇంట్లోకి వచ్చి.. మైనర్ బాలికపై అత్యాచారం..

రాజ్‌పురా గ్రామంలో 15 ఏళ్ల బాలిక తన ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టే నెపంతో ఇంట్లోకి ప్రవేశించిన కుటుంబానికి చెందిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.

minor girl was raped by a man came into the house to charge phone in Uttar Pradesh - bsb
Author
First Published Sep 28, 2023, 4:02 PM IST

ఉత్తరప్రదేశ్ : ఉత్తర్ ప్రదేశ్ లో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలంటూ ఇంట్లోకి వచ్చిన ఓ వ్యక్తి 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మైనర్లపై అత్యాచారాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పెద్దా, చిన్నా తేడా లేకుండా.. వావి వరుసలు మరిచి తెలిసిన వ్యక్తులే బాలికలు, మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు.

ఈ ఘటనలోనూ బాలికపై అత్యాచారానికి పాల్పడింది బాలిక కుటుంబానికి తెలిసిన వ్యక్తే. ఈవిషయాన్ని బుధవారం పోలీసులు చెబుతూ.. బాలికపై తెలిసిన వ్యక్తే అత్యాచారానికి పాల్పడ్డాడని అన్నారు. 

రాజ్‌పురా ప్రాంతంలోని ఓ గ్రామంలో మంగళవారం రాత్రి బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగిందని వారు తెలిపారు. నిందితుడిని చిత్రేష్‌గా గుర్తించామని, అతనిమీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సర్కిల్ అధికారి అలోక్ సిద్ధు తెలిపారు.

ఫోన్‌లో బిజీగా స్టాఫ్.. ప్లాట్‌ఫామ్‌‌ మీదకు రైలు దూసుకెళ్లిన ఘటన వీడియో వెలుగులోకి.. (వీడియో)

ఘటన జరిగిన సమయంలో బాలిక కుటుంబ సభ్యులు తమ వ్యవసాయ పొలంలో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసు సూపరింటెండెంట్ కుల్దీప్ సింగ్ గుణవత్ తెలిపారు.

ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో కలకలం రేపిన 12 ఏళ్ల బాలికపై అత్యాచారం, అర్థనగ్నంగా రక్తమోడుతూ వీధుల్లో బాలిక తిరగడం ఘటనలో ఒక ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేశారు. మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు సహాయం కోసం వేడుకుంటూ కాలినడకన 8 కిలోమీటర్లు నడిచినట్లు సీసీటీవీ ఫుటేజీలో తేలింది. దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

వివరాల ప్రకారం అరెస్టయిన ఆటో డ్రైవర్ రాకేష్ (38)గా గుర్తించారు. మైనర్ బాలిక సహాయం కోరుతూ కాలినడకన వెళ్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. ఘటన గురించి పోలీసులు విచారణలో తేలిన వివరాలను తెలుపుతూ.. , బాధితురాలు జీవన్ ఖేరీ వద్ద ఆటో ఎక్కింది.దానికి సంబంధించిన సీసీటీవీ వీడియో కూడా లభించిందని పోలీసులు తెలిపారు.

బాధితురాలు ఎక్కిన ఆటోలో రక్తపు మరకలు ఉండడంతో ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సత్నా, పోలీస్ సూపరింటెండెంట్ సచిన్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం, సంఘటన వెలుగులోకి రావడానికి ఒక రోజు ముందు మైనర్ బాలిక తప్పిపోయినట్లు ఫిర్యాదు నమోదయ్యింది. 

బాలిక వేర్వేరు ప్రదేశాలలో ఐదుగురిని కలుసుకుంది, అందరినీ విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో అరెస్టయిన మరో ముగ్గురిలో ఒకరు ఆటో డ్రైవర్ కూడా. ఈ కేసులో అదుపులోకి తీసుకున్న వారి వివరాలు వెల్లడి కాలేదు.

ఉజ్జయిని నగరంలోని ఓ వీధిలో అత్యాచారానికి గురై రక్తస్రావంతో ఉన్న 12 ఏళ్ల బాలిక గురించి ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగు చూసింది. బుధవారం ప్రత్యేక వైద్యుల బృందం ఆ బాలికకు శస్త్రచికిత్స చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ నిలకడగా ఉందని తెలిపారు.

రక్తం కారుతున్న బాలిక వీధిలో వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై జరిగిన అత్యాచారానికి సంబంధించి మహకాల్ పోలీస్ స్టేషన్‌లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) నమోదైంది. సంఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటన మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తడంతో ఎంపీ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా, షాకింగ్ నేరంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios