అక్కడ తన ఇద్దరు మిత్రులను కలిసింది. వారితో కలిసి స్కైవే పై నడుచుకుంటూ వెళుతుండగా... శ్రీకాంత్ గైక్వాడ్(30) అనే వ్యక్తి ఉన్నట్టుండి అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. 14ఏళ్ల మైనర్ బాలికపై సుత్తితో దాడి చేసి.. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మహారాష్ట్ురలోని ఠాణె జిల్లా ఉల్హాస్ నగర్ పట్టణంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
షిరిడీకి చెందిన బాధిత బాలిక.. ప్రైవేట్ బస్సులో కళ్యాణ్ లోహ్ మార్గ్ ప్రాంతానికి శుక్రవారం రాత్రి చేరుకుంది. అక్కడి నుంచి తన స్నేహితులను కలిసేందుకు ఉల్హాస్ నగర్ రైల్వే స్టేషన్ కు లోకల్ రైలులో వెళ్లింది. అక్కడ తన ఇద్దరు మిత్రులను కలిసింది. వారితో కలిసి స్కైవే పై నడుచుకుంటూ వెళుతుండగా... శ్రీకాంత్ గైక్వాడ్(30) అనే వ్యక్తి ఉన్నట్టుండి అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
బాలిక ముఖానికి కట్టుకున్న వస్త్రాన్ని బలవంతంగా లాగేశాడు. అనంతరం సుత్తితో తలపై కొట్టాడు. అడ్డుపడితే మీ పైన దాడి చేస్తానంటూ స్నేహతులను బెదిరించాడు. దీంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం నిందితుడు బాలికను రైల్వే స్టేషన్ కు సమీపంలోని ఓ పాత భవనంలోకి తీసుకుపోయి అత్యాచారం చేశాడు.
అక్కడి నుంచి బాధితురాలు తప్పించుకొని ఇంటికి చేరుకుంది. అనంతరం ఆమె కుటుంబ సభ్యులు కళ్యాణ్ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి పోలీసులు శ్రీకాంత్ గైక్వాడ్ ను అరెస్టు చేశారు. పోక్సో సహా వివిధ చట్టాల కింద కేసు నమోదు చేశారు
