భోపాల్‌ : సమాజంలో మానవత్వం మంటకలిసిపోతుంది. వావి వరుసల మరచి కామాంధులు చెలరేగిపోతున్నారు. ఆడపిల్లలపై అత్యాచారాలను అరికట్టేందుకు ఎన్ని చట్టాలను తీసుకువచ్చినా ఆడపిల్లలపై ఘోరాలను మాత్రం నియంత్రించలేకపోతున్నారు. 
 
దేశంలో ఏదో ఒకమూల చెల్లిపై అన్నయ్య, విద్యార్థిపై ఉపాధ్యాయుడు ఇలా ఎవరోఒకరు చేతిలోపడి ఆడపిల్ల బలవుతూనే ఉంది. తాజాగా భోపాల్ లో నాన్న అనే పదానికి కలంకం తీసుకువచ్చాడు ఓ వ్యక్తి. 

మీర్‌పేట్‌లో విషాదం.. సంధ్య అనే విద్యార్థిని...

నాన్న అనే మాటకే అపవిత్రం తీసుకువచ్చాడు. కన్నకూతూరిని దారుణంగా హింసించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్ లోని భిండ్ ప్రాంతానికి చెందిన 16ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో కలిసి సిర్సోడ్ గ్రామంలో నివశిస్తోంది. 


శనివారం రాత్రి బాలికను ఆమె తండ్రి ఒక గదిలో బంధించాడు. అత్యాచార యత్నం చేయబోయాడు. ఆ బాలిక ప్రతిఘటించడంతో దారుణంగా కొట్టి చిత్రహింసలు పెట్టాడు. అనంతరం అత్యాచారానికి ఒడిగట్టాడు.  

ఇకపోతే తండ్రి చెర నుంచి కాపాడమని ఆ బాలిక కేకలు వేసినా పట్టించుకునే వారే కరువయ్యారు. అయితే కుమార్తె కనిపించకపోవడంతో తల్లి వెతకడం ప్రారంభించింది. ఇల్లంతా వెతికి చూడగా బాలిక కనిపించింది. ఆమెపై జరిగిన దారుణాన్ని చూసి తల్లడిల్లిపోయింది. 

అనంతరం తన కుమార్తెపై జరిగిన దారుణంపై పోలీసులకు ఫోన్ లో ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

ఇకపోతే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికే నిందితుడు పరారైనట్లు పోలీసులు తెలిపారు. తీవ్రగాయాలతో బాధపడుతున్న బాధితురాలిని ఆస్పత్రికి తరలించామని తెలిపారు.  

పెళైన పనిమనిషిపై కన్ను... కులం పేరుతో ధూషించి...

ఇకపోతే నిందితుడికి ఆడపిల్ల జన్మించడం ఇష్టం లేదని విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఆడపిల్లకు జన్మనిచ్చిందన్న కారణంతో బాధితురాలి తల్లిని సైతం నిత్యం వేధించే వాడని తెలిసిందన్నారు. 

తల్లీ బిడ్డలను ఎలాగైనా వదిలించుకోవాలని వారిని నిత్యం చిత్ర హింసలకు గురి చేసేవాడని విచారణలో స్థానికులు తెలిపారని చెప్పుకొచ్చారు. ఇకపోతే బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన రోజు సైతం తల్లిని కొట్టడంతో ఆమె వేరే గదిలోకి ఏడుస్తూ కూర్చుండిపోయిందని అన్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని తొందర్లోనే పట్టుకుని శిక్షపడేలా చూస్తామని తెలిపారు.