ఆర్థిక పరిస్థితి బాగోక, అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... బాధిత మహిళ(32) కి పెళ్లయ్యింది. అయితే... ఆమె భర్త మతిస్థిమితం సరిగాలేక ఇబ్బంది పడుతున్నాడు. దీంతో... ఆమె పలువురి ఇళ్లల్లో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. కాగా... ఆమె ఓ వ్యక్తి ఇంటి వద్ద అద్దెకు ఉంటూ.. వారి ఇంట్లోనే పనిచేస్తోంది.

కాగా... ఆమె పనిచేసే ఇంటి యజమానులు గత నెలలో ఢిల్లీ వెళ్లారు. వారి కుమారుడు(32) మాత్రమే ఇంట్లో ఉన్నాడు. కాగా... పని చేయడానికి ఇంట్లోకి వెళ్లిన ఆమెపై ఆ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ ఆమెను బెదిరించడం గమనార్హం. కాగా.. వెంటనే ఆమె ఢిల్లీలో ఉన్న ఇంటి యజమానికి ఫోన్ చేసి చెప్పింది. కాగా... వాళ్లు.. తాము త్వరలోనే హైదరాబాద్ వస్తామని.... వచ్చి దాని గురించి మాట్లాడతామని చెప్పడంతో.. ఆమె పోలీసులను కూడా ఆశ్రయించలేదు.

తర్వాత హైదరాబాద్ చేరుకున్న ఇంటి యజమానులు... సదరు పనిమనిషికి న్యాయం చేయాల్సిందిపోయి... ఆమెను ధూషించారు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని ఇక్కడితో మర్చిపోవాలని బెదిరించారు. ఆమెను కులం పేరుతో కూడా ధూషించడం గమనార్హం. దీంతో... చేసేది లేక బాధితురాలు గత నెల 21వ తేదీన పోలీసులను ఆశ్రయించింది. అయితే... ఈ విషయం వెలుగులోకి మాత్రం చాలా ఆలస్యంగా వచ్చింది.

AlsoRead తల్లిని చంపిన కీర్తి: చంచల్‌గూడ జైల్లో ప్రత్యేక నిఘా...

ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ... కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. బాధితురాలు చెప్పింది నిజమని తేలితే...నిందితుడిని అరెస్టు చేస్తామని  చెప్పారు.