బాయ్ ఫ్రెండ్ ని కలుద్దామని వచ్చింది.. కానీ.. కామాంధుల బారిన పడింది. తన బాయ్ ఫ్రెండును కలవడానికి వచ్చిన ఓ బాలికకు లిఫ్టు ఇస్తామని చెప్పి నమ్మించారు. ఆమెను కారులో తీసుకువెళుతూ అందులోనే ఆరుగురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన త్రిపుర రాష్ట్రంలోని ఖాసియామంగల్ ప్రాంతంలో వెలుగుచూసింది. 
 
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ మైనర్ బాలిక తన ప్రియుడిని కలిసేందుకు అతని ఇంటికి వచ్చింది. బాలిక బాయ్ ఫ్రెండ్ తో పాటు ఆరుగురు యువకులు అక్కడకు వచ్చారు. కొద్ది సేపటి తర్వాత ఆమెను ఇంటి వద్ద కారులో దిగబెడతామని చెప్పి ఎక్కించుకున్నారు. ఆ కారులతో బాలిక బాయ్ ఫ్రెండ్ తోపాటు మరో ఐదుగురు యువకులు కూడా ఉండటం గమనార్హం.  యువకులు కారులోనే బాలికపై లైంగిక దాడి జరిపారు.ఈ ఘటనలో బాధిత బాలిక ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి, నిందితులైన ఆరుగురు యువకులను అరెస్టు చేశామని ఎస్పీ కిరణ్ కుమార్ చెప్పారు.