'ఓ దేవుడా ...నన్ను రక్షించు..' లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి.. 20 నిమిషాల పాటు నరకయాతన .. వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఓ దయానీయమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ చిన్నారి అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్‌లో ఓ బాలిక ఇరుక్కుపోయింది. ఆ చిన్నారి 20 నిమిషాల పాటు నరకయాతన అనుభవించింది. ఈ సమయంలో ఆ చిన్నారి తనను కాపాడాలంటూ కేకలు వేస్తూనే ఉంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నగరాల్లో అపార్ట్ మెంట్ కల్చర్ పెరిగిపోతుంది. అందులో నివాసం ఉంటే వారి సౌకర్యార్థం ఆ అపార్ట్ మెంట్ నిర్వహకులు లిప్టులను ఏర్పాటు చేస్తున్నారు. అయితే.. నిర్వహణ లోపం వల్ల లిప్టులు ప్రమాదాలకు గురికావడం లేదా లిప్టు రాక ముందే లిప్టు తలుపులు తెరుచుకోవడం, లేదా లిప్టు ఎక్కిన తర్వాత సాంకేతిక సమస్యలు తల్లెత్తడంతో అందులోనే ఇరుక్కపోవడం వంటి పలు ఘటనలు చూస్తునే ఉన్నాం.
తాజాగా అలాంటి ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో వెలుగులోకి వచ్చింది. ఓ అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్‌లో ఓ చిన్నారి ఇరుక్కుపోయింది. ఆ చిన్నారి తనని తాను కాపాడుకోవడానికి నానా కష్టాలు పడింది. ఎంత ప్రయత్నించిన లిప్టు తలుపులు తెరుచుకోకపోవడంతో దాదాపు 20 నిమిషాల పాటు నరకయాతన అనుభవించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ తెగవైరల్ అవుతోంది.
వివరాల్లోకెళ్లే... లక్నోలోని కుర్సీలో జనేశ్వర్ ఎన్‌క్లేవ్ ఉంది. ఈ అపార్ట్ మెంట్ లోని బి-1105 ఫ్లాట్‌లో నివాసం ఉంటున్న ధ్వని అవస్థి అనే చిన్నారి బుధవారం మధ్యాహ్నం సమయంలో లిప్ట్ ఎక్కింది. అయితే.. ఆ చిన్నారి ఎక్కిన మరుక్షణమే కరెంటు పోయింది. దీంతో లిఫ్ట్ సడెన్ గా ఆగిపోయింది. లిప్టులో ఆ చిన్నారి ఒంటరిగా ఉండటంతో తీవ్ర భయాందోళనకు గురైంది.
అయినా.. ఆ చిన్నారి ధైర్యం తెచ్చుకుని లిప్టు తలుపులు తెరవడానికి తన వంతు ప్రయత్నం చేసింది. ఈ సమయంలో గట్టిగా అరవడం, ఏడవడం చేసింది. లిఫ్ట్‌లో కెమెరా ఉందని ఆ చిన్నారికి తెలుసు. ఆ కెమెరా వైపు చూస్తూ వేడుకుంది. చేతులు జోడించి.. "ఓ దేవా, నన్ను రక్షించు" అని దేవుడిని ప్రార్థించడం ఆ వీడియోలో గమనించవచ్చు. ఇలా ఆ చిన్నారి దాదాపు 20 నిమిషాల పాటు నరకయాతన అనుభవించింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆ బాలిక లిఫ్ట్‌లో ఇరుక్కుపోయింది. కరెంట్ రావడంతో 20 నిమిషాల తర్వాత సురక్షితంగా బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.
విద్యుత్తు అంతరాయం కారణంగానే ఆ చిన్నారి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిందని, వెంటనే ఆమెను రక్షించారని అపార్ట్ మెంట్ నిర్వహకులు చెప్పారు. భద్రతా కారణాల దృష్ట్యా 12 ఏళ్లలోపు పిల్లలను లిఫ్ట్‌లో ఒంటరిగా ప్రయాణించేందుకు అనుమతించవద్దని నివాసితులను ఆయన అభ్యర్థించారు.