Asianet News TeluguAsianet News Telugu

చెరకు తోటలో మైనర్ బాలిక మృతదేహం, చిత్రహింసలు పెట్టి, కళ్లు పీకి.. దారుణ హత్య...

ఉత్తరప్రదేశ్‌లో ఓ 13 ఏళ్ల బాలికను చెరకు తోటలో కొట్టి చంపారు. బాలికను చిత్రహింసలకు గురిచేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

minor girl dead body was found in a sugarcane plantation, tortured and eyes gouged out in uttarpradesh - bsb
Author
First Published Oct 12, 2023, 8:05 AM IST

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. జిల్లాలోని ఒక గ్రామంలో ఉన్న చెరుకుతోటలో 13 ఏళ్ల బాలిక చిధ్రమైన మృతదేహం లభ్యమైంది. ఆ బాలికను  చిత్రహింసలకు గురిచేసి చంపినట్లుగా కనిపిస్తుంది. ఆ బాలిక ఉదయం పాఠశాలకు వెళ్లి, తిరిగా రాలేదు. దీంతో రాత్రి వరకు ఎదురుచూసిన తల్లిదండ్రులు, అన్ని చోట్లా వెతికి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దీనిమీద ఫిర్యాదు నమోదు చేయలేదు.


మరుసటి రోజు ఉదయం గ్రామస్థులు బాలిక మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బాలిక కళ్లను బయటకు పీకారని, చిత్రహింసలకు గురిచేసినట్లుగా కనిపిస్తుందని తెలిపారు. ఆ తరువాత ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పంపించి ఫిర్యాదు నమోదు చేశారు.

హోంవర్క్ సరిగా​ చేయలేదని చిన్నారిపై టీచరమ్మ కర్కషం.. వీపుపై వాతలు వచ్చేలా.. 35సార్లు..

లఖింపూర్ ఖేరీ పోలీసు సూపరింటెండెంట్ (SP) గణేష్ ప్రసాద్ సాహా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని పరిశోధించి, మూడు దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసుల నిర్లక్ష్యమే ఆమె మృతికి కారణమని బాధితురాలి తల్లి ఆరోపించారు. పోలీసులు తన ఫిర్యాదును సకాలంలో నమోదు చేసి ఉంటే, రెండు రోజులుగా కనిపించకుండా పోయిన బాలికను రక్షించగలిగేవారని ఆమె అన్నారు.

ఎస్పీ మాట్లాడుతూ, “ప్రాథమికంగా, చాలా గాయాల గుర్తులు కనిపిస్తున్నందున, బాలికను కొట్టి చంపినట్లు కనిపిస్తోంది, అయితే పోస్ట్‌మార్టం పరీక్ష తర్వాత వాస్తవాలు తెలుస్తాయన్నారు. సమీపంలోని పోలీస్ స్టేషన్‌ల నుండి కూడా నిఘా బృందాలను ఈ కేసును చేధించడానికి నియమించాం. నిజంగా జరిగిందేమిటో కనిపెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రజలను కూడా ప్రశ్నిస్తున్నాం. కుటుంబ సభ్యులతో మాట్లాడాం. వారు ప్రస్తుతం ఎవరి మీదా అనుమానాలు వ్యక్తం చేయడం లేదు”అన్నారాయన.

Follow Us:
Download App:
  • android
  • ios