New Delhi: ఢిల్లీలోని ఓ పార్కులో ఓ యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో నలుగురు నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నాలుగో నిందితుడి కోసం, ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న బాలిక స్నేహితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Minor girl gangraped in park in Delhi: ఢిల్లీలోని ఓ పార్కులో ఓ యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో నలుగురు నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నాలుగో నిందితుడి కోసం, ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న బాలిక స్నేహితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. దేశరాజధాని ఢిల్లీలోని షాబాద్ డెయిరీ ప్రాంతంలో మంగళవారం 16 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు. బాధితురాలు తన స్నేహితుడితో కలిసి పార్కులో ఉండగా మంగళవారం ఈ ఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు తమ వద్దకు వచ్చి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు. నేరం చేసిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అయితే నిందితుల్లో ఒకరు పరారీలో ఉన్నారు. ఈ సంఘటన సమయంలో అక్కడే ఉన్న బాధితురాలి స్నేహితుడిని కనుగొనడంపై కూడా పోలీసులు దృష్టి సారించారు. నిందితుడికి అప్పటికే బాధితురాలితో పరిచయం ఉందా లేక ఆమె స్నేహితురాలితో పరిచయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై 376డి (సామూహిక అత్యాచారం), లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంతో సహా భారతీయ శిక్షాస్మృతిలోని మూడు సెక్షన్ల కింద అభియోగాలు మోపినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
యువతిపై సీఆర్‌పీఎఫ్ జవాన్‌ను అత్యాచారం..
21 ఏళ్ల విద్యార్థినిపై సస్పెన్షన్ కు గురైన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాను అత్యాచారం చేసిన ఘటన బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. అత్యాచారం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీతాబుల్ది పోలీసులు ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లోని హస్ పూర్ కు చెందిన రిటైర్డ్ జవాను రాజేష్ తోమర్ (34)ను అరెస్టు చేశారు.
