Asianet News TeluguAsianet News Telugu

13 ఏళ్ల బాలికపై మైనర్ బాలుడి అత్యాచారం.. మరొకడు కాపలా.. ఇంట్లోకి దూరి మరీ దారుణం!

గురుగ్రామ్‌లో 13 ఏళ్ల మైనర్ బాలికపై.. 17 ఏళ్ల మైనర్ బాలుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. పక్కా ప్లాన్‌తో వచ్చిన ఆ నిందితుడు.. బాధితురాలి ఇంట్లోకి చొరబడ్డాడు. తన ఫ్రెండ్‌ను వెంట తెచ్చుకుని ఇంటి బయట కాపలా ఉంచాడు. బాలిక అరుపులు విని తల్లిదండ్రులు రాగానే వారు పరారయ్యారు.

minor boy rapes minor girl in gurugram accused friedn stood guard for him
Author
Gurugram, First Published May 21, 2022, 6:49 PM IST

న్యూఢిల్లీ: హర్యానాకు చెందిన గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలుడు.. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పక్కా ప్లాన్ ప్రకారం, ఈ దాడికి పాల్పడ్డాడు. ఓ సారి ఆ మైనర్ బాలిక బాత్రూమ్‌లో ఉన్నప్పుడు దూరాడు. అనుకోకుండా వచ్చానని చెప్పి బయటపడ్డాడు. మరోసారి ఓ బాలుడిని వెంట బెట్టుకుని ఏకంగా ఇంట్లోకి దూరాడు. వెంట తెచ్చుకున్న బాలుడు ఇంటి తలుపులు దగ్గర వేసి తాళం వేసి వెలుపలి వైపు కాపలాగా ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది. ఆ ఇద్దరు నిందితులనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గురుగ్రామ్‌కు చెందిన ఓ 17 ఏళ్ల బాలుడు అదే గురుగ్రామ్‌కు చెందిన 13 ఏళ్ల బాలికపై కన్నేశాడు. ఓ సారి ఆ బాలిక స్నానం చేస్తుండగా బాత్రూమ్‌లోకి వెళ్లాడు. తప్పుదారిగా స్నాన గదిలోకి వచ్చినట్టు చెప్పి బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఆమె కదలికలను పసిగడుతూనే ఉన్నాడు. ఆ 17 ఏళ్ల బాలుడు మరో 15 ఏళ్ల బాలుడితో పక్కా స్కెచ్ వేసి రంగంలోకి దిగాడు. ఎవరూ లేని సమయం చూసి ఆ బాలిక ఇంట్లోకి దూరాడు.

17 ఏళ్ల బాలుడు 13 ఏళ్ల బాలిక ఇంట్లోకి దూరగానే.. ఆ 15 ఏళ్ల బాలుడు ఇంటి డోర్ దగ్గర వేసి బయటి నుంచి తాళం వేశాడు. బయటే వారికి కాపలాగా ఉన్నాడు. బాధితురాలి సోదరి ఇంట్లోనే ఉండటం గమనార్హం.

తాను ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో 17 ఏళ్ల బాలుడు లోనికి వచ్చాడని, తన సోదరిని రేప్ చేశాడని ఫిర్యాదు చేసింది. 15 ఏళ్ల బాలుడు ఇంటి బయట డోర్‌కు లాక్ వేసి కాపలాగా ఉన్నాడని పేర్కొంది.  బాలిక అరుపులు వేయడంతో తల్లిదండ్రులు ఇంటికి వచ్చారని ఆమె తెలిపింది. తల్లిదండ్రులు ఇంటికి రాగానే ఆ ఇద్దరూ పారిపోయారని వివరించింది. ఈ ఫిర్యాదు ఆధారంగా బజగేర పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మే 17వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. 

పోలీసులు ఈ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చిల్డ్రెన్స్ కోర్టులో హాజరుపరిచారు. వారిని ఫరీదాబాద్‌లోని చిల్డ్రన్ హోమ్‌కు రిమాండ్ మీద తరలించినట్టు పోలీసు అధికారులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios