Asianet News TeluguAsianet News Telugu

బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం.. సుత్తితో మోది హత్య, ఆపై ఉరేసి...

ఓ మైనర్ బాలుడు.. 14యేళ్ల అమ్మాయిమీద అత్యాచారానికి పాల్పడి.. దారుణంగా హత్య చేశాడు. ఆ తరువాత ఉరేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. 

minor boy rape and murder 14years girl in uttarpradesh - bsb
Author
First Published Jun 9, 2023, 11:01 AM IST

ఉత్తర ప్రదేశ్ : ఇటీవలి కాలంలో మైనర్లు అఘాయిత్యాలకు, హత్యలకు పాల్పడుతున్న ఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. అభం శుభం తెలియని వయసులోనే.. క్రూరత్వం, హింసలను వారి మనసులను నిండా నింపుకోవడం.. ఆందోళన కలిగించే విషయం. మహారాష్ట్రలో 13 ఏళ్ల బాలుడు క్రికెట్ ఆట విషయంలో జరిగిన గొడవలో 12 ఏళ్ల బాలుడిని బ్యాట్ తో కొట్టి చంపాడు. మరో ఘటనలో తరగతి గదిలో.. తోటి విద్యార్థిని మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. పక్కింటి చిన్నారుల మీద మైనర్లే అత్యాచారానికి పాల్పడి, హత్యలు చేస్తున్నారు.

ఇలాంటి కోవలోకి వచ్చే ఓ ఘటనే ఉత్తర ప్రదేశ్ లోని లఖ్ నవూలో వెలుగు చూసింది. ఓ బాలుడు 14 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమె తలపై సుత్తితో మోది.. ఉరేసి చంపేశాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాలిక తల్లిదండ్రులు పనుల నిమిత్తం బయటకు వెళ్లడంతో.. బాలిక ఒంటరిగా ఇంట్లో ఉంది. ఆ సమయంలో ఓ బాలుడు ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమె మీద అత్యాచారం చేశాడు.

అద్దె ఇంట్లో ఇతర రాష్ట్రాల యువతులతో వ్యభిచారం.. నిర్వాహకుల అరెస్ట్

అంతటితో ఊరుకోకుండా.. ఆమె తలపై సుత్తితో కొట్టాడు. ఆ తర్వాత ఫ్యాన్ కు ఉరి వేశాడు. సాయంత్రం పనుల నుంచి ఇంటికి వచ్చిన బాలిక తల్లిదండ్రులు ఓ బాలుడు వరండాలో నిల్చుని ఉండడం గమనించారు. దీంతో అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే.. తల్లిదండ్రులను చూసిన బాలుడు తప్పించుకున్నాడు. వారికి అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా.. బాలిక ఫ్యానుకు వేలాడుతూ శవంగా కనిపించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడు కోసం గాలిస్తున్నారు.

ఇదిలా ఉండగా, గురువారం ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. అక్కడి చంద్రపూర్ జిల్లాలో క్రికెట్ ఆడే విషయంలో వాగ్వాదం జరిగింది. ఈ గొడవ తర్వాత 13 ఏళ్ల బాలుడు 12 ఏళ్ల మరో మైనర్ బాలుడిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చినట్లు పోలీసులు గురువారం తెలిపారు. నిందితుడు బాధితుడి తలపై బ్యాట్‌తో కొట్టడంతో జూన్ 3న ఈ ఘటన జరిగింది. బాలుడు చికిత్స పొందుతూ జూన్ 5న మృతి చెందాడని వారు తెలిపారు.

బాధితుడి కుటుంబం ఈ విషయం మీద పోలీసు ఫిర్యాదు నమోదు చేయకుండా మృతదేహాన్ని పూడ్చిపెట్టిందని నగర పోలీసు స్టేషన్ అధికారి తెలిపారు. అతని తల్లి మంగళవారం పోలీసులను ఆశ్రయించగా, కేసు దర్యాప్తు కోసం బుధవారం మృతదేహాన్ని వెలికితీసినట్లు అతను చెప్పాడు.

జూన్ 3న ఇక్కడి బగద్కిడ్కి ప్రాంతానికి చెందిన కొందరు కుర్రాళ్లు ఓ మైదానంలో క్రికెట్ ఆడుతున్నారు. ఆట ఆడుతున్న సమయంలో బాధితుడు ఇతర అబ్బాయిలతో వాగ్వాదానికి దిగాడని, నిందితులు అతనిని బ్యాట్‌తో కొట్టారని అధికారి తెలిపారు.

బాధితుడు నేలపై పడిపోయాడు. వెంటనే జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ జూన్ 5న మృతి చెందినట్లు తెలిపారు. అతని బంధువులు పోలీసు కంప్లైంట్ నమోదు చేయకుండానే అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, అతని తల్లి మంగళవారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు అధికారి తెలిపారు.

అనంతరం కేసు విచారణ నిమిత్తం పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారని తెలిపారు. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశామని, బాలుడిని ఇంకా పట్టుకోలేదని అధికారి తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios