పంజాబ్ పోలీసులు 17 ఏళ్ల బాలుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 15 కిలోల హెరాయిన్ మరియు 8.40 లక్షల నగదును గురువారం అమృతార్‌లో స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

సరిహద్దుల్లో జరుగుతున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంలో పంజాబ్ పోలీసులు మరోసారి విజయం సాధించారు. ఈ క్రమంలో 17 ఏళ్ల మైనర్ బాలుడి నుంచి రూ.8.40 లక్షల విలువైన 15 కిలోల హెరాయిన్, డ్రగ్స్ డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ డిజిపి గౌరవ్ ఓదవ్ గురువారం విలేకరులకు వెల్లడించారు. అమృత్‌సర్‌లో నివాసముంటున్న ఓ బాలుడు తన సహచరుడితో కలిసి కక్కర్ గ్రామం నుండి డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత డెలివరీ చేసేందుకు వెళ్తున్నట్లు డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు.

పాకిస్తాన్‌కు చెందిన స్మగ్లర్లు డ్రోన్ ద్వారా ఈ డ్రగ్స్‌ను జారవిడిచారని, వీటిని డెలివరీ చేయడానికి వెళుతుండగా ఆ బాలుడిని పక్కా సమాచారంతో ఇంటెలిజెన్స్ బృందం దాడి చేసి పట్టుకున్నట్టు తెలిపారు. స్మగ్లర్‌కు సహకరించిన మరో వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. పరారీలో ఉన్న నిందితుడిని ఖాసా నివాసి రేషమ్ సింగ్‌గా గుర్తించారు. కాగా మైనర్ స్మగ్లర్ కక్కర్ గ్రామ నివాసి. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందం దాడులు నిర్వహిస్తోంది. మిగతా నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. అమృత్‌సర్‌కు చెందిన మైనర్ బాలుడి నుంచి డ్రగ్స్ రవాణాకు ఉపయోగించిన హీరో డీలక్స్ మోటార్‌సైకిల్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

15 కేజీల హెరాయిన్‌, రూ.8.40 లక్షల డ్రగ్స్ స్వాధీనం

సమాచారం ప్రకారం.. రహస్య సమాచారం ఆధారంగా కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందం గ్రామ మహల్‌ను దిగ్బంధించినట్లు సమాచారం. ఇంతలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను అనుమానం వచ్చి అడ్డుకున్నారు. నిందితుల్లో ఒకరైన రేషమ్ సింగ్ తప్పించుకోగలిగాడు. అతని సహచరుడు, మైనర్ స్మగ్లర్‌ను పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 15 కిలోల హెరాయిన్, రూ.8.40 లక్షల డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బాలుడి తండ్రి ,తాత ఇప్పటికే ఎన్‌డిపిఎస్ చట్టం కింద జైలు శిక్ష అనుభవిస్తున్నారని అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అమర్‌జిత్ సింగ్ బజ్వా తెలిపారు.

భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సంబంధిత సెక్షన్ల కింద నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పంజాబ్ పోలీసులు సరిహద్దు దాటిన డ్రగ్ స్మగ్లింగ్ కార్టెల్‌ను ఛేదించి, డ్రగ్ స్మగ్లర్‌ను అరెస్టు చేసిన పది రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ దాడిలో 5 కిలోల బరువున్న ఐదు హెరాయిన్ ప్యాకెట్లు, రూ.12.15 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.