Asianet News TeluguAsianet News Telugu

Republic Day 2022: రిపబ్లిక్ డే పరేడ్ లో శ్రీఅర‌బిందో శ‌క‌టం

Republic Day 2022:  భార‌త్ లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు (Republic Day 2022) ఘ‌నంగా జ‌రిగాయి. భార‌త్ స్వాతంత్య్రం పొంది 75 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. దీనిలో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌గా జరుపుకుంటున్నారు. రాజ్‌ప‌థ్ లో కొన‌సాగుతున్న రిప‌బ్లిక్ డే ప‌రేడ్ అక‌ట్టుకున్నాయి. ఆధాత్మిక గురువు శ్రీ అరబిందో 150వ జ‌యంతి సంద‌ర్భంగా.. కేంద్ర సాంస్కృతిక శాఖ రాజ్‌ప‌థ్‌పై శ‌క‌టాన్ని ప్ర‌ద‌ర్శించింది.  
 

Ministry of Culture presents tableau on Sri Aurobindos life, works as nation celebrates his 150th birth anniversary
Author
Hyderabad, First Published Jan 26, 2022, 1:51 PM IST

Republic Day 2022:  భార‌త్ లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు (Republic Day 2022) ఘ‌ట‌నంగా జ‌రుగుతున్నాయి. ఈ సారి జ‌రుగుతున్న రిపబ్లిక్ డే 2022 వేడ‌క‌ల‌కు చాలా ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా భార‌త్ స్వాతంత్య్రం పొంది 75 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. దీనిలో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌గా జరుపుకుంటున్నారు.రాజ్‌ప‌థ్ లో కొన‌సాగుతున్న రిప‌బ్లిక్ డే ప‌రేడ్ అక‌ట్టుకుంటోంది. ప‌రేడ్ లో మొద‌ట‌గా ఇండియ‌న్ ఆర్మీ ప‌రాక్ర‌మాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ ప‌రేడ్ కొన‌సాగింది. అనంత‌రం భార‌తీయ విభిన్న సంస్కృతులు, సంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబింబిస్తూ.. రాష్ట్రాల శ‌క‌టాల ప్ర‌ద‌ర్శ‌న‌లు కొన‌సాగాయి. 

రాజ్‌ప‌థ్‌లో ఇవాళ శ‌క‌టాల ప్ర‌ద‌ర్శ‌న అకట్టుకుంది. వివిధ రాష్ట్రాల‌తో పాటు వివిధ కేంద్ర శాఖ‌లు కూడా త‌మ శ‌క‌టాల‌ను ప్ర‌ద‌ర్శించాయి. అత్యంత వైభ‌వంగా రిపబ్లిక్ డే ప‌రేడ్‌లో శ‌క‌టాల‌ను ప్ర‌ద‌ర్శించారు. ఆధాత్మిక గురువు శ్రీ అరబిందో 150వ జ‌యంతి సంద‌ర్భంగా.. కేంద్ర సాంస్కృతిక శాఖ రాజ్‌ప‌థ్‌పై శ‌క‌టాన్ని ప్ర‌ద‌ర్శించింది. భార‌త స్వాతంత్య్ర సంగ్రామ స‌మ‌యంలో.. శ్రీఅర‌బిందో త‌న ఆధ్యాత్మిక బోధ‌న‌ల‌తో ప్ర‌జ‌ల్లో చైత‌న్యాన్ని క‌లిగించారు. ప్ర‌వ‌క్త‌గా, దార్శ‌నిక‌నేత‌గా అర‌బిందోను కీర్తించారు.

 

మహిళా సాధికారత గురించి కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ ఓ శకటాన్ని ప్రదర్శించింది. 

 

 

రిప‌బ్లిక్ డే 2022 ప‌రేడ్ లో ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్  'భారత వైమానిక దళం భవిష్యత్తు కోసం వినూత్నంగా ముందుకు సాగుతూ.. అనేక మార్పులు తీసుకుంటున్న‌ద‌నే' అనే థీమ్‌ను ప్రదర్శిచింది. 

 

రిప‌బ్లిక్ డే నేప‌థ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ (Republic Day 2022) శుభాకాంక్ష‌లు తెలిపారు. భారతదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు సాధారణంగా జనవరి 24 నుండి ప్రారంభమవుతాయి, అయితే, ఈ సంవత్సరం నుండి అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ (netaji subhas chandra bose) జయంతిని పుర‌ష్క‌రించుకుని జనవరి 23 నుండి గ‌ణ‌తంత్ర వేడుక‌లు (Republic Day) నిర్వ‌హిస్తోంది ప్ర‌భుత్వం.

Follow Us:
Download App:
  • android
  • ios