Asianet News TeluguAsianet News Telugu

Aryan Khan: సమీర్ వాంఖడేపై ఎన్‌సీబీ నుంచే ఫిర్యాదు..! లెటర్ షేర్ చేసిన మంత్రి

ఆర్యన్ ఖాన్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి సమీర్ వాంఖడేపై ఆరోపణలతో అసలు కేసు పక్కదారి పట్టింది. ఇప్పుడు సమీర్ వాంఖడే వర్సెస్ మంత్రి నవాబ్ మాలిక్‌గా మారింది. సమీర్ వాంఖడేపై ఫిర్యాదులు చేస్తూ ఎన్‌సీబీ నుంచే ఓ అధికారి మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌కు లేఖ పంపారు.
 

minister nawab malik attacks sameer wankhede over ncb employee letter
Author
Mumbai, First Published Oct 26, 2021, 12:50 PM IST

ముంబయి: Aryan Khan నిందితుడిగా ఉన్న క్రూజ్ Drugs కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. Sameer Wankhede సారథ్యంలో ఈ కేసు దర్యాప్తు జరుగుతున్నది. కానీ, కేసులోని ఓ సాక్షి వెనుకపట్టుపట్టి.. సమీర్ వాంఖడేపైనే సంచలన ఆరోపణలు చేశారు. అయితే, దీనికి ముందు నుంచే మహారాష్ట్ర మంత్రి Nawab Malik సమీర్ వాంఖడేపై ఆరోపణలు చేస్తూనే వచ్చారు. ఈ కేసులో అధికారులు పారదర్శకంగా వ్యవహరించలేదని, బీజేపీ నేతలతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సమీర్ వాంఖడేపై ఆరోపణలు వచ్చిన తర్వాత కేసుపైనున్న ఫోకస్ అంతా ఇప్పుడు ఈ అధికారిపైనకే మళ్లింది. తాజాగా, నవాబ్ మాలిక్ ఓ Letter షేర్ చేసి ఈ సైడ్ ట్రాక్‌నే మెయిన్ ట్రాక్ చేసినట్టయింది. ఇప్పుడు నవాబ్ మాలిక్ వర్సెస్ సమీర్ వాంఖడేగా కేసు మారింది. సమీర్ వాంఖడేపై NCBలో పనిచేస్తున్న ఓ అధికారే ఫిర్యాదులు చేసినట్టు మంత్రి వివరించారు.

ఈ రోజు ఉదయం నుంచి నవాబ్ మాలిక్ ట్విట్టర్‌లో ఆసక్తికరంగా ట్వీట్లు చేశారు. త్వరలోనే స్పెషల్ 26 రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపారు. తర్వాత ఓ లెటర్ ఎన్వలప్‌ను పోస్టు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎన్‌సీబీలో రెండేళ్లుగా చేస్తున్నట్టు పేర్కొన్న ఓ అధికారి తనకు ఓ లేఖ పంపారని వివరించారు. సమీర్ వాంఖడేపై అనేక ఆరోపణలు అందులో ఉన్నాయని తెలిపారు.

Also Read: ఆర్యన్ ఖాన్ కేసులో మరో మలుపు.. ఢిల్లీకి ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడే.. అలాంటిది ఏం లేదని వెల్లడి..

సమీర్ వాంఖడే 26 కేసుల్లో నిబంధనలు పాటించకుండా వ్యవహరించారని ఆ లేఖలో పేరు పేర్కొనని అధికారి ఆరోపించినట్టు మంత్రి నవాబ్ మాలిక్ వివరించారు. సమీర్ వాంఖడేపై మొదలుపెడుతున్న దర్యాప్తులో భాగంగా ఈ లేఖను కూడా పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. ఈ లేఖను ఎన్‌సీబీ డైరెక్టర్ జనరల్‌కు పంపిస్తున్నట్టు పేర్కొన్నారు.

నా యుద్ధం ఏజెన్సీపై కాదు.. అన్యాయంపై పోరాడుతున్నాను. ఈ ఉద్యోగాన్ని తప్పుడు మార్గాల్లో సంపాదించుకున్న ఓ ఉద్యోగి వ్యవహారాన్ని బహిర్గతం చేస్తున్నాను. ఎన్‌సీబీ జాబ్ పొందడానికి సమీర్ వాంఖడే నకిలీ బర్త్ సర్టిఫికేట్ వినియోగించారని తెలిపారు. సమీర్ వాంఖడే థానే, ముంబయిలలో కొందరు వ్యక్తుల ద్వారా అక్రమంగా ఫోన్‌ ట్యాపింగ్‌లకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

Also Read: ఆర్యన్ ఖాన్ కేసులో అనూహ్య ట్విస్ట్.. సాక్షి సంచలన ఆరోపణలు.. 18 కోట్ల డీల్.. నాకు ప్రాణ హాని

ఈ ఆరోపణలపై వాంఖడే స్పందించారు. అవన్ని కుట్రపూరితమైనవని, అవాస్తవాలని కొట్టిపారేశారు. ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు ఉన్నదని అన్నారు. ముంబయి ఎన్‌సీబీ డైరెక్టర్ జనరల్ ముత అశోక్ జైన్ ఈ లేఖపై స్పందిస్తూ తానూ ఆ లెటర్ చూశారని, సరిపడా యాక్షన్ తీసుకుంటామని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios